Virat - Rohit: కోహ్లీ, రోహిత్ జీతాల్లో రూ.2 కోట్ల కోత!.. కారణం ఏంటంటే
Virat-Rohit-Sharma (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Virat – Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జీతాలను రూ.2 కోట్ల మేర తగ్గించబోతున్న బీసీసీఐ!.. కారణం ఇదేనా?

Virat – Rohit: టీమిండియా దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli – Rohit Sharam) ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మూడు వన్డేలు ఆడి.. 2 సెంచరీలు, ఒక అర్ధ శతకంతో విజృంభించాడు. రోహిత్ శర్మ కూడా చాలా చక్కగా తనవంతు సహకారం అందించాడు. అయితే, ఈ ఇద్దరి దిగ్గజాల వార్షిక జీతాలను బీసీసీఐ దాదాపు రూ.2 కోట్ల మేర తగ్గించబోతోందనే ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

దీనికి కారణం ఏంటంటే, క్రికెటర్లకు జీతాలు నిర్ణయించే సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఈసారి కోహ్లీ, రోహిత్ శర్మల కేటగిరీలను బీసీసీఐ తగ్గించవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ ఇద్దరు దిగ్గజాలు ఆటగాళ్లు ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. కేవలం ఒకే ఫార్మాట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నందున తదుపరి కాంట్రాక్టుల సైకిల్‌లో ‘ఏ ప్లస్’ (A+) కేటగిరి నుంచి ఏ (A)- కేటగిరిలోకి మార్చవచ్చంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఊహాగానాల ప్రకారం, కోహ్లీ, రోహిత్ ఇద్దరినీ ఏ-కేటగిరిలోకి తీసుకొచ్చే వారిద్దరి వార్షివ వేతనం రూ.7 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గిపోతుంది. ఏ ప్లస్ కేటగిరిలోని ప్లేయర్లు సంవత్సరానికి రూ.7 కోట్ల ప్యాకేజీ అందుకుంటుంటారు. బీసీసీఐ చివరిసారిగా ఏప్రిల్ 2025లో సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించింది.

Read Also- Satya Nadella: ఏఐ తో సత్య నాదెళ్ల భారీ ప్లాన్.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ తో కొత్త ఒప్పందాలు

4 కేటగిరీలుగా కాంట్రాక్టులు

బీసీసీఐ ప్రతిఏడాది ఆటగాళ్లకు 4 కేటగిరీలలో కాంట్రాక్ట్‌లు ఇస్తుంది. జాతీయ జట్టులో చోటుసంపాదించుకొని ఆడుతున్న ఆటగాళ్లకు ఈ కాంట్రాక్టుల్లో చోటిస్తుంది. ఆటగాళ్లు ఏయే ఫార్మాట్లలో ఆడుతున్నారనే దానిని బట్టి కాంట్రాక్ట్, వారికి ఇచ్చే పారితోషికాన్ని బీసీసీఐ నిర్ణయిస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శనను ప్రోత్సహించడం సెంట్రల్ కాంట్రాక్టుల ప్రధాన లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో ప్లేయర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి కాంట్రాక్టుల ద్వారా ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తుంది. సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్, జట్టు కెప్టెన్‌తో సంప్రదింపులు జరిపి గ్రేడ్‌ల కేటాయింపు చేపడుతారు.

మొత్తం నాలుగు కేటగిరీలు

సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ 4 వేర్వేరు గ్రేడ్‌లుగా విభజిస్తుంది. ఏ ప్లస్ (A+), ఏ (A), బీ (B), సీ (C). కేటగిరిని బట్టి జీతాలను నిర్ణయిస్తారు. ఒక్కసారి కేటగిరి నిర్ణయించిన తర్వాత ఆ ప్లేయర్ ఎన్ని మ్యాచ్‌లు ఆడినా అదే జీతం వర్తిస్తుంది. కానీ, మ్యాచ్ ఫీజు రూపంలో అదనపు ఆదాయం దక్కుతుంది.

Read Also- Minister Sridhar Babu: నైపుణ్యాలే యువత భవిష్యత్తు.. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు!

గిల్ ఈ సారి ఏ ప్లస్ కేటగిరి

టెస్ట్ క్రికెట్‌లో స్థిరంగా రాణించే ఆటగాళ్లకు అందరికంటే మెరుగ్గా ఏ-గ్రేడ్, అంతకంటే ఎక్కువైన ఏ ప్లస్ గ్రేడ్‌లు ఇస్తుంటారు. ఏ+ కేటగిరీలో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణించే ఆటగాళ్లకు మాత్రమే చోటుదక్కుతుంది. వచ్చే కాంట్రాక్టుల సైకిల్‌లో ఈసారి టీమిండియా టెస్ట్ కెప్టెన్‌, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ‌‘ఏ ప్లస్’ కేటగిరీలోకి ప్రమోట్ అయ్యే అవకాశం కనబడుతోది. కాగా, నిలకడమైన ప్రదర్శన చేసే ఆటగాళ్ల కాంట్రాక్టులు మెరుగుపడుతుంటాయి. అద్భుతంగా రాణించే ప్లేయర్లకు వారి ప్రదర్శనకు తగ్గట్టుగానే ప్రమోషన్లు లభిస్తుంటాయి. అలాగే, ఫామ్ లేదా ఫిట్‌నెస్ సమస్యలతో సరైన సహకారం అందించలేని ప్లేయర్లకు డీమోషన్లు కూడా ఎదురవుతుంటాయి.

Just In

01

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!