IND vs SA 1st T20I Prediction: భారత్ – సౌతాఫ్రికా మధ్య నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. కటక్ (Cuttack)లోని బరబటి స్టేడియం (Barabati Stadium) వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న సాతాఫ్రికాపై ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అలాగే నేటి నుంచి జరగబోయే మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో యువ క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు.
దూకుడు మీద టీమిండియా..
టీమిండియా విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు గత కొంత కాలంగా టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఆసియా కప్ – 2025 విజేతగా నిలవడం, ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించడం ద్వారా పూర్తి ఆత్మవిశ్వాసంతో నేటి మ్యాచ్ లో బరిలోకి దిగబోతోంది. 2026లో జరిగే టీ20 ప్రపంచప్ కు ఎక్కువ సమయం లేకపోవడంతో ఈ మ్యాచ్ లో దుమ్మురేపడం ద్వారా క్రికెట్ లోకానికి మంచి సందేశం పంపాలని యువ క్రికెటర్లు పట్టుదలతో ఉన్నారు. అటు దక్షిణాఫ్రికా విషయానికి వస్తే పొట్టి ఫార్మెట్ లో ఆ జట్టు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఇటీవల పాక్ తో జరిగిన టీ-20 సిరీస్ ను 1-2 తేడాతో ఆ జట్టు కోల్పోయింది. అంతకుముందు నమీబియాతో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ ను కూడా కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను అతికష్టం మీద డ్రాగా ముగించింది. కాబట్టి టీమిండియా నుంచి సౌతాఫ్రికాకు గట్టి పోటీ తప్పదని చెప్పవచ్చు.
కటక్ పిచ్ రిపోర్ట్
తొలి టీ20 జరగనున్న కటక్‌లోని బరబటి స్టేడియం ఇప్పటివరకూ 3 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. వాటిలో రెండింటిలో దక్షిణాఫ్రికా పాల్గొని రెండింటినీ గెలుచుకుంది. ఇక్కడ ఛేజింగ్ చేసిన జట్లు.. రెండుసార్లు విజయాన్ని సాధించాయి. మరోవైపు పిచ్ స్పిన్, పేస్ రెండింటికి అనుకూలంగా ఉండనున్నట్లు సమాచారం. అయితే బంతి ఎక్కువగా గ్రిప్ అయ్యే అవకాశాలు లేకపోవడం వల్ల భిన్నమైన వేరియేషన్లు ఉన్న బౌలర్లు ఎక్కువ విజయం సాధించే అవకాశముంది. కటక్ పిచ్ పై 160 పరుగులు సాధించిన జట్టు సేఫ్ జోన్ లో ఉండే అవకాశముంది.
గత రికార్డులు..
భారత్ – సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకూ 31 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో టీమిండియా 18 గెలవగా.. సౌతాఫ్రికా 12 విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. ఇరుజట్ల మధ్య తొలి టీ-20 2006 డిసెంబర్ 1న జరిగింది. చివరిగా నవంబర్ 15, 2024లో ఇరుజట్లు తలపడ్డాయి. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ తర్వాత ఇరు జట్లు ఇవాళే పొట్టి ఫార్మెట్ ఆడుతుండటం గమనార్హం.
గేమ్ ఛేంజర్‌గా అభిషేక్ శర్మ!
తొలి టీ20లో దుమ్మురేపే అవకాశముమన్న భారత ఆటగాళ్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ ముందు వరుసలో ఉన్నారు. అతడు టీ20 ఫార్మెట్ లో ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆసియా కప్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఆ ఫామ్ ను ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లోనూ కొనసాగించాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆరు మ్యాచులు ఆడి.. అందులో ఒక శతకం, 2 అర్ధ శతకాలతో రాణించాడు. కాబట్టి ఇవాళ్టి మ్యాచ్ లోనూ అభిషేక్ రాణిస్తే భారత్ కు తిరుగుండదని చెప్పవచ్చు.
Also Read: Bigg Boss9 Telugu: అలా చెప్పడంతో ఇమ్మానుయేల్‌పై ఫైర్ అయిన భరణి.. ఈ క్లాష్ ఏంది భయ్యా..
వరుణ్ చక్రవర్తి తిప్పేస్తాడా?
టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే.. మిస్టరీ స్పిన్నర్.. వరుణ్ చక్రవర్తి ప్రభావం ఈ మ్యాచ్ పై ఉండవచ్చు. కటక్ పిచ్ స్వభావం.. అతడి భిన్నమైన బౌలింగ్ శైలికి అనుకూలంగా మారే అవకాశముంది. బంతిని రెండు వైపులా స్పిన్ చేయగల సామర్థ్యం వరుణ్ సొంతం. పరుగులను ఆపడంలో దిట్టగా ఉన్న అతడ్ని.. ఎదుర్కొవడం సౌతాఫ్రికా బ్యాటర్లకు అంత ఈజీగా కాకపోవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. కాబట్టి కటక్ పిచ్ లో అతడి నాలుగు ఓవర్ల స్పెల్ మ్యాచ్ లో అత్యంత కీలకంగా మారవచ్చు.
భారత జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, గిల్, సూర్య కుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్య, జితేశ్ శర్మ/సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, హర్షిత్ రానా

