Telangana Forest: రాష్ట్రంలో అడవులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ అటవీశాఖలో మహిళలే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో విధులు నిర్వహిస్తూ అడవులను సంరక్షిస్తున్నారు. తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎఫ్ఆర్వో కేడర్ కీలకం
భవిష్యత్ తరాలకు నాణ్యమైన వాతావరణం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో కీలక భూమిక పోషించేది చెట్లు.. ఫారెస్టు. అయితే సమాజంలో ప్రస్తుతం కీలకంగా మారిన అటవీని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఫారెస్టును కాపాడే బాధ్యతను ప్రభుత్వం మహిళలకు అప్పగించింది. ఫారెస్టులో ఇండియన్ ఫారెస్టు సర్వీసు(Indian Forest Service), ఎఫ్ఆర్వో(FRO) కేడర్ కీలకం. అయితే ఈ కీలక పోస్టుల్లో 83 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా కిందిస్థాయి కేడర్ లోనూ వందల సంఖ్యలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరు ఆటవిని కాపాడటంలో కీలకంగా మారారు.
ఎఫ్ఆర్వోలుగా 76 మంది
రాష్ట్ర అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారిగా సువర్ణ విధులు నిర్వరిస్తుండగా, అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారికగా సునీత ఎం.భగవత్, సీసీఎఫ్ గా ప్రియాంక వర్గీస్, ఎస్ జే ఆశ, క్షితిజ, శివాణి డోగ్రా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటవీశాఖలో డీసీఎఫ్, ఏసీఎఫ్, ఎఫ్ఆర్వోలుగా 76 మంది పనిచేస్తున్నారు. వీరంతా నిత్యం మానిటరింగ్ చేయడంతో ఉద్యోగులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
Also Read: Siddipet Collector: 2వ విడత నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ హైమావతి
బోర్లు వేసి సోలార్
పులులతో వణ్యప్రాణుల సంక్షరణ చర్యలు చేపడుతున్నారు. అటవీ సమీప ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వేసవిలో అటవీలో మంటలు వేయకుండా, అగ్ని ప్రమాదాలు జరుగకుండా, పులిసంచారం తెలిస్తే సమాచారం ఇచ్చేలా మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఎక్కడైనా సంచారం ఉన్నట్లు తెలిస్తే దానిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనికి తోడు టైగర్ రిజర్వుల పరిరక్షణ, బఫర్ జోన్ల పరిధిలో మైనింగ్ కార్యకలపాలు జరుగకుండా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. అదే విధంగా అటవీ ప్రాంతంలో మొక్కల నాటే కార్యక్రమం, వేసవిలో జంతువుల నీటి కోసం ఇబ్బందులు పడకుండ ససార్ పిట్ ల ఏర్పాటు చేపడుతున్నారు. అంతేగాకుండా 2 కిలో మీటర్ల పరిధిలో బోర్లు వేసి సోలార్ అమర్చుతున్నారు. నీటికుంటలు, సోలార్‌బోర్లు, చెక్ వాల్స్‌లఏర్పాటు చేస్తున్నారు. అంతేగాకుండా అటవీ ప్రాంతాల్లో వరద ప్రవాహంలో భూమి కోతకు గురయ్యే భూసారం దెబ్బతినే అవకాశం ఉండటంతో దానిని పెంపొందించేందుకు చెక్‌డ్యాంలను నిర్మించారు. చెక్‌డ్యాంల నిర్మాణంతో అటవీ ప్రాంతంలోని వరదనీరు వాటిలో చేరడంతో భూమి కోతకు గురికాకుండ ఉంటుందని అటవీశాఖ సిబ్బంది అంటున్నారు.
పులలదాడిలో..
మరోవైపు అటవీశాఖ ను సైతం తెలంగాణ ప్రభుత్వం మంత్రి కొండా సురేఖకు అప్పగించింది. అటవీ పరిరక్షణతో పాటు జంతువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. పులలదాడిలో గాయపడిన మనుషులకు ఉచిత చికిత్సతోపాటు పరిహారం సైతం అందజేస్తున్నారు. పశువులు, గొర్రెలు, మేకలు దాడిలో మృతి చెందితే వాటికి సైతం పరిహారం ఇస్తున్నారు. కొండా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అటవీశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏది ఏమైనప్పటికీ అటవీశాఖ అంటేనే మహిళ అధికారులు అనే ప్రత్యేకగుర్తింపు పొందింది.
