Siddipet Collector: 2వ విడత నామినేషన్లు పరిశీలించిన కలెక్టర్
Siddipet Collector ( image Credit: swetcha Reporter)
నార్త్ తెలంగాణ

Siddipet Collector: 2వ విడత నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ హైమావతి

Siddipet Collector: 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 ప్రక్రియలో భాగంగా  సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి మరియు పొన్నాల క్లస్టర్లలో రెండో విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిట్టపల్లి క్లస్టర్ లో మిట్టపల్లి, పాండవపురం, మందపల్లి పొన్నాల క్లస్టర్ లో పొన్నాల, కిష్ట సాగర్, నాంచార్ పల్లి గ్రామాల నామినేషన్ లు స్వీకరిస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కు తెలిపారు.

Also ReadCM Revanth Reddy: కులగణన రోల్ మోడలే కాదు..రేర్ మోడల్ దీని అర్థం త్వరలోనే చెబుతా!

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

జిల్లాలో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని మొదటి దశలో 7 మండలాలు రెండవ దశలో 10 మండలాలు మూడో దశలో 9 మండలలోని గ్రామాల్లో ఎన్నికల జరుగుతుందనీ మొదటి దశ నామినేషన్ ప్రక్రియ పూర్తయినది రెండవ దశలో అక్బర్ పేట భూంపల్లి, తొగుట, మీరుదొడ్డి, దుబ్బాక, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావు పేట్, బెజ్జంకి మండలాల్లో ఈరోజు నుండి మూడు రోజులపాటు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 వరకు 58 క్లస్టర్ లలో నామినేషన్ లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

క్లస్టర్ చుట్టూ 100 మీటర్ల పరిధి

స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం క్లస్టర్ లో నామిని అభ్యర్థులకు సహాయార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్వోలు నామినీ అభ్యర్థుల అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతే స్లిప్ అందజేయాలని తెలిపారు. క్లస్టర్ చుట్టూ 100 మీటర్ల పరిధిలో నామిని అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించాలని మరియు బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

Also Read: Hyderabad District Collector: రుణాల మంజూరులో బ్యాంకులు ముందుండాలి: కలెక్టర్ హరిచందన

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!