Happy International Men’s Day 2025: ప్రతి ఏడాది నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే ను జరుపుకుంటారు. మన జీవితంలో ఉన్న పురుషులు చూపించే ప్రేమ, శ్రద్ధ, కష్టాలు, బాధ్యతలన్నింటిని గుర్తు చేసుకునే ప్రత్యేక రోజు. బాయ్‌ఫ్రెండ్ అయినా, ఫ్రెండ్ అయినా, అన్న/తమ్ముడు, నాన్న, సహోద్యోగి లేదా గురువైన మన జీవితం బాగుపడేలా తోడుండే వాళ్లను అభినందించడానికి ఇదే మంచి సమయం.
అంతర్జాతీయ పురుష దినోత్సవం అంటే?
ఈ రోజు పురుషుల శారీరక మానసిక ఆరోగ్యం, వాళ్ల సంక్షేమం కోసం అలాగే పురుష–మహిళల సమానత్వం గురించి అవగాహన పెంచడానికి జరుపుకుంటారు. అంటే, పురుషులు కూడా భావాలు వ్యక్తపరచాలి, ప్రేమగా ఉండాలి, మనస్పూర్తిగా మాట్లాడాలి అన్నది సందేశం.
ఈ రోజు పురుషులు డే ఎందుకు సెలబ్రేట్ చేయాలంటే?
చాలా మంది పురుషులు బయటకు చెప్పకపోయినా.. కుటుంబం, బాధ్యతలు, బలంగా ఉండాలనే ఒత్తిడి.. ఇలాంటి ఎన్నో భారాలు మౌనంగా మోస్తుంటారు. ఈ రోజు వారికి ఈ నాలుగు మాటలు చెప్పండి. వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు.
“నువ్వు చేస్తున్న కష్టం కనిపిస్తోంది”
“నీ భావాలు కూడా ముఖ్యం”
“నీ ఆరోగ్యం కూడా చూసుకో”
“నువ్వు ఉన్నందుకే ఈ కుటుంబం బలంగా ఉంది”
అంతర్జాతీయ పురుష దినోత్సవం 2025 సందర్భంగా మీ బాయ్ ఫ్రెండ్ కి ఇలా విష్ చేయండి. ఇక్కడ మీ కోసం కొన్ని కోట్స్ ఉన్నాయి.
నా జీవితంలో ప్రేమ, ఓపిక, స్థిరత్వం తీసుకొచ్చిన హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే!
నువ్వు నా బలమైన సపోర్ట్, నా ఫేవరేట్ పర్సన్. హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే!
ఎప్పుడూ నన్ను కాపాడుతూ, నాకు అండగా ఉంటున్న నీకు థ్యాంక్స్.. హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే!
నీ మంచి మనసు, నీ దయ.. నన్ను ప్రతిరోజూ ప్రేరేపిస్తాయి. హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే!
నీలో ఉన్న ప్రేమ, జాగ్రత్త, బలం.. ఇవి నిజమైన మగాడి లక్షణాలు. హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే!
నువ్వు నాతో ఉన్నప్పుడే నా లైఫ్ బ్రైట్ గా కన్పిస్తుంది. హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే!
ఈ రోజు నువ్వు ఎంత మంచి మనిషివో సెలబ్రేట్ చేస్తున్నాను. హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే!
నీ ప్రెజెన్స్ నా జీవితాన్ని ఇంకా అందంగా మార్చేస్తుంది. హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే!
నువ్వు పరిపూర్ణం కాకపోయినా.. నాకు మాత్రం పరిపూర్ణుడివి. హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే!
