Manchu Lakshmi: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ ఫ్రెండ్స్ లో రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి జోడి ఒకటి. చాలాకాలంగా కొనసాగుతున్న ఈ ఇద్దరి స్నేహం అభిమానులకు కూడా బాగా తెలిసిన విషయమే. షూటింగ్ గ్యాప్‌ల్లో హాలీడేస్‌కి వెళ్లటం, వీకెండ్స్ గ్యాదరింగ్స్, పార్టీల్లో ఇద్దరూ పాల్గొనటం.. కొన్నేళ్ల పాటు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఈ ఇద్దరి ఫోటోలు తప్ప మరేమీ కనిపించని రోజులు కూడా వచ్చాయి. అయితే, ఇటీవల రకుల్ పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ కలిసి కనిపించే సందర్భాలు తగ్గిపోయాయి. ఈ మార్పుపై మంచు లక్ష్మి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా ‘మాయ మేల్ ఫెమినిస్ట్’ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మంచు లక్ష్మి, తన వ్యక్తిగత జీవితం, ఇండస్ట్రీ అనుభవాలు, స్నేహితుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. దానిలోనే భాగంగా రకుల్ గురించి మాట్లాడుతూ.. “ ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ రకుల్. కానీ, ఇటీవల మా లైఫ్‌లలో చాలానే మార్పులు వచ్చాయి. నేను ముంబైకి వెళ్లిపోయాను. రకుల్ జాకీని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత రకుల్‌లో వచ్చిన మార్పులు నాకు షాక్ ఇచ్చాయి.” అని చెప్పింది.
అలాగే ఆమె ఇంకా మాట్లాడుతూ “ ఏ చిన్న విషయం అయినా జాకీకి చెప్పాలి అని అంటాది. మనం ఎక్కడికైనా వెళ్దామని అడిగినా ‘ముందు జాకీని అడిగి చెప్తాను’ అంటుంది. కొత్తగా పెళ్లైన వారిలో ఇది కామన్. ప్రతిదీ భర్తని అడిగి చెయ్యాలా .. అలా ఏ రాజ్యాగంలో రాసి ఉంది? ఇంకో ఏడాది వరకు వదిలేస్తా.. అప్పటికీ మారకపోతే మాత్రం వదిలేది లేదు.. అరుస్తాను, గొడవ పడతాను.. వార్నింగ్ కూడా ఇస్తాను,” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి. అభిమానులు కూడా వీరి స్నేహంపై తమ కామెంట్స్ ను పంచుకుంటున్నారు.
