Bhatti-Vikramarka (Image source Whatsapp)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Global Summit Telangana: గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు స్థల పరిశీలన చేసిన ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క

Global Summit Telangana:

మేడ్చల్, స్వేచ్ఛ: డిసెంబర్‌లో జరిగే గ్లోబల్ సమ్మిట్ (Global Summit Telangana) నిర్వహణ కోసం వేదిక స్థలాన్ని ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని దుండిగల్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 453, 454లను ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క సోమవారం పరిశీలించారు. ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, కలెక్టర్ మను చౌదరి, ఈవీ నర్సింహా రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రైసింగ్ విజన్ 2047 అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు కూడా ఆహ్వానం పలుకుతోందని తెలిపారు. హైదరాబాద్ అనుకూలమైన వాతావరణం, అత్యంత నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ఉండడంతో పెట్టుబడిదారులను మరింతగా ఆకర్షిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీవో టీ శ్యామ్ ప్రకాశ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read Also- VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లకు ప్రణాళికలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్లోబల్ సమ్మెట్ నిర్వహణకు స్థల పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో, మేడ్చల్ జిల్లాలో దుండిగల్ ప్రాంతాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్థలాలను అన్వేశిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబరు 7కు రెండేళ్లు అవుతుంది. ఈ సందర్బంగా తెలంగాణ రైజింగ్-2047′ డాక్యుమెంటరీని ప్రభుత్వం విడుదల చేయనుంది.

రెండు రోజులకు వేదికకు సన్నాహాలు…

ప్రభుత్వ ఏర్పాటు చేసే వేదికల్లో ప్రైవేటు కంపెనీల స్టాళ్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఒక ట్రిలియన్, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికతో ముందుకు పోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ వేదికల్లో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. 8న స్థానిక, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు, చర్చలు ఉంటాయి. 9న తెలంగాణ రైజింగ్ 2047 డాకుమెంటరీ విడుదల చేస్తారు. భారీగా డ్రోన్ షో కూడా నిర్వహించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన సుమారు 500 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వారికి ఆతిథ్యం, భద్రతా చర్యలపై కూడా ప్రభుత్వం దిశానిర్దేశం అధికారులకు చేయనున్నారు.

Read Also- Teachers Unions: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌కు ఉపాధ్యాయ సంఘాల పిలుపు.. ఎందుకంటే?

ప్రపంచ వేదిక పై తెలంగాణ ఇమేజీ

తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ పటంలో ఉంచాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే పలు వేదికలపై స్పష్టంచేశారు. మూసీ పునరుజ్జీవం, తెలంగాణ వ్యవసాయ వికాసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే ప్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి హద్దు రాయిగా చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డు అభివృద్ధి తో నగరం నాలుగు వైపులా సిటీని విస్తరించడం జరుగుతుంది. బాపూ ఘాట్ వద్ద నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టులు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్-నాగ్పుర్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో తెలంగాణ ప్రాధాన్యతను ప్రదర్శించనున్నారు.

Just In

01

Premante Trailer: ‘సారం లేని సంసారం వద్దు.. విడాకులే ముద్దు’.. హిలేరియస్!

Tortoise: రాజ్ తరుణ్ మరో ప్రయోగం.. ఈసారి ‘టార్టాయిస్’గా..!

Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో దొరికిన సహకుట్రదారుడు.. సంచలనాలు వెలుగులోకి

Bigg Boss Telugu 9: కుండలు బద్దలవుతున్నాయ్.. రీతూ వర్సెస్ డిమోన్.. అసలైన ఆట మొదలైంది..

Jagriti Janam Baata: సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ మైన్‌ను సందర్శించిన కవిత.. కీలక వ్యాఖ్యలు