CM Revanth Reddy: సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతోనే హైదరాబాద్ కు పోటీ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దేశంలోని ఏ ఇతర నగరాలు తమకు పోటీ కాదని స్పష్టం చేశారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ (Arban Development Ministers Regional Meeting) లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
వికసిత్ భారత్ – 2047 (Viksit bharat 2047) అనుగుణంగా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ (Prime Minister Modi) పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దీనిని సాధించడంలో భాగంగా హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్ ను రేవంత్ రెడ్డి కోరారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులు వేగంగా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు అందించాలని రిక్వెస్ట్ చేశారు.
రాబోయే ఏడాదిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ నగరంలో తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ (Telangana rising 2047 vision document) విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. దేశ ఎకానమీలో 10 శాతం ఎకానమీని తెలంగాణ నుంచి అందించాలని భావిస్తున్నట్లు రేవంత్ పేర్కొన్నారు.
Also Read: Delhi Car Blast: 2021 నుంచే కుట్ర.. 6 నగరాల్లో డీ6 మిషన్.. లేడీ డాక్టర్ ప్లాన్ రివీల్!
హైదరాబాద్ నగర అభివృద్ధితోపాటు తాము భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నట్లు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘మా పోటీ ఇతర రాష్ట్రాల నగరాలతో కాదు.. మా పోటీ సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం’ అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘటించారు.
అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి..
డిసెంబర్ 9న 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రెజెంట్ చేయబోతున్నాం
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్ కు విజ్ఢప్తి
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ పనిచేస్తోంది… https://t.co/8zP2BNkKyJ pic.twitter.com/P87h7baqTl
— BIG TV Breaking News (@bigtvtelugu) November 18, 2025
