Royal Enfield ( Image Source: Twitter)
బిజినెస్

Royal Enfield Bullet 650: త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 లాంచ్..

Royal Enfield Bullet 650: ప్రపంచ బైక్ లవర్స్ ని ఆకర్షించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ను కంపెనీ ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న EICMA 2025 ఎగ్జిబిషన్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. క్లాసిక్ బుల్లెట్ స్టైల్‌కి శక్తివంతమైన 650cc ఇంజిన్‌ను యాడ్ చేస్తూ.. రూపొందించిన ఈ మోడల్, ఓల్డ్ మోడల్ కి చెందిన బుల్లెట్ కొత్త టెక్నాలజీతో కలిపినట్టుగా ఉంది.

బుల్లెట్ 350 డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 వేరియంట్‌కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి కొత్త మార్పులు చేసింది. ఈ కొత్త మోడల్ క్యానన్ బ్లాక్ , బ్యాటిల్‌షిప్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Also Read: Uttam Kumar Reddy: జూబ్లీహిల్స్‌లో అదరగొట్టిన మంత్రి ఉత్తమ్.. ఆయన ప్రచారం చేసిన చోట కాంగ్రెస్‌కు తిరుగులేని మెజారిటీ

క్లాసిక్ లుక్‌లో ప్రీమియం టచ్

బుల్లెట్ 650లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సిగ్నేచర్ సర్క్యులర్ LED హెడ్‌ల్యాంప్, క్రోమ్ హ్యాండిల్‌బార్లు, స్పోక్ వీల్స్, బాక్సీ రియర్ ఫెండర్ వంటి క్లాసిక్ అంశాలు కనిపిస్తాయి. టియర్‌డ్రాప్ ఆకారంలోని ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, ఫెండర్లపై గోల్డ్ పిన్స్‌ట్రైప్స్ ఇవ్వడంతో బైక్‌కు రెట్రో ఫినిష్ వచ్చింది. అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లీవర్స్, లాంగ్ రైడ్స్‌కు సరిగ్గా సరిపోయే కాంటూర్డ్ సింగిల్-పీస్ సీట్‌ను అందించారు.

Also Read:  The Girlfriend Collections: బాక్సాఫీస్ వద్ద రష్మిక మూవీ కొత్త రికార్డ్ .. ది గర్ల్‌ఫ్రెండ్ 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

సెమీ-డిజిటల్ క్లస్టర్ & ట్రిప్పర్ నావిగేషన్

సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో అనలాగ్ స్పీడోమీటర్‌తో పాటు గేర్ పొజిషన్, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ వంటి డిజిటల్ సమాచారం లభిస్తుంది. ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ స్టాండర్డ్‌గా అందించబడింది.

ఇంజిన్ & పనితీరు

బుల్లెట్ 650లో రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 647.95cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ని ఉపయోగించారు. ఈ ఏర్/ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్:
47 bhp పవర్ @ 7,250rpm
52.3 Nm టార్క్ @ 5,150rpm

6-స్పీడ్ గేర్‌బాక్స్ ,వెట్ మల్టీప్లేట్ క్లచ్‌తో జత చేయబడింది.

Also Read: Varanasi Video Response: ‘వారణాసి’ వీడియోపై ప్రేక్షకుల అభిమానానికి మహేష్, రాజమౌళి ఏం అన్నారంటే?

ఎప్పుడు లాంచ్? ఎంత ధర?

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650ను భారత్‌లో నవంబర్ 2025 చివరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర రూ. 3.40 లక్షలు (ఎక్స్-షోరూం) గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అధికారిక ధరను మోటోవర్స్ 2025 ఈవెంట్ సందర్భంగా ప్రకటించనున్నారు. ఈ ఈవెంట్ నవంబర్ 21–23 తేదీల్లో గోవాలోని వాగటర్‌లో జరుగుతుంది.

Just In

01

Miryalaguda: మిర్యాలగూడ అభివృద్ధిపై ఫోకస్.. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: యువత రాజకీయాల్లోకి రావాలి… కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు

VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

Chain Snatching: ఎంతకు తెగించార్రా.. ఉదయాన్నే బరితెగించిన చైన్ స్నాచర్స్

Jagtial: జగిత్యాల జిల్లాలో దారుణం.. 7 ఏళ్ల బాలికపై అఘాయిత్యం