Varanasi Video Response: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుల దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్ వీడియో సంచలనం సృష్టించింది. ఈ వీడియో విడుదలైన తర్వాత అభిమానులు, మీడియా నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన పట్ల చిత్ర బృందం అమితానందాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మహేష్ బాబు, రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Read also-Akhanda2 3D Release: 3డీలో రాబోతున్న బాలయ్య బాబు ‘అఖండ 2 తాండవం’.. ఇక ఫ్యాన్సుకు పూనకాలే..
హృదయాన్ని తాకిన అభిమానుల ప్రేమ- మహేష్ బాబు
వారణాసి సినిమా ప్రకటన సందర్భంగా మహేష్ బాబు స్పందిస్తూ, తమ టీమ్‌పై అభిమానులు చూపించిన అపారమైన ప్రేమ, శక్తిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్టు తెలిపారు. “ఈ ప్రేమ, శక్తిలోని ప్రతి బిట్‌ను తీసుకుంటున్నాను.. ఇదిగోండి, మా వారణాసి సినిమా ప్రపంచానికి. దూరం నుండి తరలివచ్చి, మా టీమ్‌పై ఇంతటి ఆప్యాయతను, ప్రేమను కురిపించిన నా అభిమానులకు, మీడియాకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ ఆయన భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. వారణాసి పట్టణంపై ప్రత్యేక ప్రేమను చాటుకుంటూ, “మళ్లీ త్వరలోనే మీ అందరినీ కలుస్తాను” అని పేర్కొన్నారు. మహేష్ బాబు మాటలు సినిమాపై ఆయనకున్న నిబద్ధతను, అభిమానుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని స్పష్టం చేశాయి.
ప్రేక్షకుల ప్రశంసలకు ధన్యవాదాలు- రాజమౌళి
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా వారణాసి అనౌన్స్‌మెంట్ వీడియోకి లభించిన ఆదరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. “వారణాసి అనౌన్స్‌మెంట్ వీడియోకి మీరంతా చూపించిన ప్రేమ, ప్రశంసలు, కరతాళ ధ్వనులకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఆయన ట్వీట్ చేశారు. ఈ అద్భుతమైన స్పందన పట్ల తమ వారణాసి మూవీ టీమ్ ఎంతగానో కృతజ్ఞులమని రాజమౌళి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, రాజమౌళి ప్రకటన వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ విధంగా, మహేష్ బాబు రాజమౌళిల ప్రకటనలు వారణాసి వీడియోకు వచ్చిన అనూహ్య స్పందనను ధృవీకరిస్తున్నాయి. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఈ అగ్ర తారలు, దర్శకుడు వ్యక్తం చేసిన కృతజ్ఞతాభావం యావత్ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ దేశ వ్యాప్తంగా ప్రేక్షుల అభిమానాన్ని పొందుతుంది. అంతేకాకుండా, చలిలో కూడా దాదాపు 3 కిలోమీటర్లు నడిచి వచ్చిన అభిమానుల ఓపికను రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “మా వైపు చిన్నపాటి సాంకేతిక సమస్యలు ఎదురైనా, మీ ఓపిక ఎక్కడా సన్నగిల్లలేదు. మీరు మీ అభిమాన నటుడిలాగే అంత క్రమశిక్షణతో ఉన్నారని చెప్పక తప్పదు!” అంటూ రాజమౌళి మహేష్ అభిమానుల నిబద్ధతను మెచ్చుకున్నారు.
Taking in every bit of the love and energy… Here’s our @VaranasiMovie to the world.
Thank you to my fans, media and everyone who came from far and showered the team with so much affection….♥️♥️♥️ See you all again very soon… 🤗🤗🤗 #Varanasi pic.twitter.com/OexVgyquEq
— Mahesh Babu (@urstrulyMahesh) November 16, 2025
