Cyber Security ( Image Source: Twitter)
బిజినెస్

Cyber Security: తెలియని లింక్‌ల నుంచి APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసా?

Cyber Security: ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి సాధారణంగా APK ఫైళ్లు ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్  (Android Package Kit) ను  వాడుతారు. ఇవి యాప్‌కు అవసరమైన అన్ని ఫైల్స్‌ కలిగిన ప్యాకేజీలా ఉంటాయి. అయితే, ఆ విషయం ఎవరికీ తెలియదు. సాధారణంగా ఈ ఫైళ్లు Google Play Storeలో అందుబాటులో ఉంటాయి, కానీ కొందరు వినియోగదారులు ఇతర వెబ్‌సైట్ల నుంచి కూడా వీటిని డౌన్‌లోడ్ చేస్తారు. అయితే, తెలియని లింక్‌ల నుంచి APK ఫైళ్లు ఓపెన్ చేయడం తీవ్రమైన సైబర్ ముప్పుగా మారుతుంది.

ఎందుకు APK ఫైళ్లను తెలియని లింక్‌ల నుంచి ఓపెన్ చేయకూడదు?

1. మాల్వేర్ ముప్పు

తెలియని వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసిన APK ఫైళ్లలో వైరస్‌లు, స్పైవేర్, ర్యాన్స్‌మ్వేర్ వంటి డేంజరస్ సాఫ్ట్‌వేర్ దాగి ఉండే అవకాశం ఉంది. ఇవి మీ ఫోన్ డేటాను దొంగిలించగలవు అలాగే మీ డివైస్‌ను కూడా డ్యామేజ్ చేయగలవు.

Also Read: Typhoon Fung Wong: ఫంగ్-వాంగ్ తుఫాన్ బీభత్సం.. ఫిలిప్పీన్స్‌లో భారీ నష్టం.. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

2. నమ్మకంలేని సోర్స్‌లు

గూగుల్ ప్లే స్టోర్ లోని Google Play Storeలోని యాప్‌లు భద్రతా పరీక్షల తర్వాత మాత్రమే అందుబాటులోకి వస్తాయి. కానీ తెలియని వెబ్‌సైట్లలోని APK ఫైళ్లు హ్యాకర్లు లేదా మోసగాళ్లు రూపొందించినవిగా ఉంటాయి. కాబట్టి, అలాంటి వాటిని ఓపెన్ చెయ్యకూడదు.

3. సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో మార్పులు

ఇలాంటి APK ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు “Unknown Sources” ఆప్షన్‌ను ఆన్ చేయాలి. దీని వలన మీ ఫోన్ ఇతర హానికర యాప్‌లకు ఈజీగా స్ట్రాంగ్ గా మారుతుంది.

4. డేటా ప్రైవసీ సమస్యలు

కొన్ని APK ఫైళ్లు కాంటాక్ట్స్, ఫోటోలు, మెసేజ్‌లు లేదా లొకేషన్ వంటి వివరాలకు యాక్సెస్ కోరుతాయి. అవి నకిలీ యాప్‌లు అయితే, ఈ డేటాను హ్యాకర్లతో పంచుకోవచ్చు.

Also Read:  Free Gemini Pro Offer: భారీ గుడ్ న్యూస్.. జియో కస్టమర్లకు గూగుల్ జెమినీ ప్రో ఫ్రీ యాక్సెస్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

ప్రమాదకర APK ఫైళ్లను ఓపెన్ చేస్తే ఏమవుతుంది?

మాల్వేర్ ఇన్ఫెక్షన్: ఫోన్‌లో డేంజరస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయి ఫోన్ కూడా స్లో అవుతుంది.

డేటా చోరీ: బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి అందుతుంది.

ఫోన్ డ్యామేజ్: ఫోన్ నెమ్మదిగా పనిచేయడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం, ఫైళ్లు కరప్ట్ కావడం వంటివి జరుగుతాయి.

అవసరంలేని అనుమతులు: యాప్ కెమెరా లేదా మైక్రోఫోన్‌ యాక్సెస్ కోరుతూ మీపై గమనించవచ్చు.

Also Read: Bigg Boss Telugu 9 : నామినేషన్లలో రచ్చ రచ్చ.. సహనం కోల్పోయిన రీతూ.. హౌస్ మేట్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు

సురక్షితంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు

నమ్మకమైన సోర్స్‌ల నుంచే డౌన్‌లోడ్ చేయండి: గూగుల్ ఫ్లే స్టోర్ (Google Play Store) లేదా సామ్ సంగ్ గెలాక్సీ స్టోర్ ( Samsung Galaxy Store) వంటి అధికారిక ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించండి.

లింక్‌లను జాగ్రత్తగా చెక్ చేయండి: యాప్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేసే ముందు వెబ్‌సైట్ నమ్మకమైనదో కాదో చూసుకోండి.

యాంటీవైరస్ ఉపయోగించండి: ఫోన్‌లో యాంటీవైరస్ లేదా యాంటీ-మాల్వేర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి APK ఫైళ్లను స్కాన్ చేయండి.

యాప్ అనుమతులు పరిశీలించండి: యాప్ అవసరంలేని డేటాకు యాక్సెస్ కోరితే వెంటనే ఆపివేయండి.

‘Unknown Sources’ ఆప్షన్ ఆఫ్‌లో ఉంచండి: ఇది యాదృచ్ఛికంగా హానికర యాప్‌లు ఇన్‌స్టాల్ కావడం నివారిస్తుంది.

Just In

01

Bigg Boss Telugu 9: హౌస్‌లో ‘మండే’ మంటలు మొదలయ్యాయ్.. ఇంకెవరూ ఆపలేరు!

Swathi murder case: వీడిన స్వాతి మర్డర్ మిస్టరీ.. వెలుగులోకి సంచలన నిజాలు!

Air Pollution Protest: ఊపిరి పీల్చలేకపోతున్నాం, రక్షించండి.. రోడ్డెక్కిన దిల్లీ జనం.. పిల్లలు కూడా అరెస్ట్?

Bandi Sanjay: మజ్లిస్ అండతోనే కిడ్నాప్, అత్యాచారాలు.. కేంద్ర మంత్రి బండి సంచలన కామెంట్స్!

KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం..కేటీఆర్ కీలక వ్యాఖ్యలు