JNTU Nachupally Ragging (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

JNTU Nachupally Ragging: నాచుపల్లి జేఎన్టీయూలో.. కోరలు తెరిచిన ర్యాగింగ్ భూతం!

JNTU Nachupally Ragging: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ భూతం కోరలు తెరుచుకుంది. “ఇంటరాక్షన్” పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్లను మానసికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. సీనియర్ల ఒత్తిడి, బెదిరింపులతో జూనియర్లు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిసింది. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఘటనలు ఆగకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రొటెక్షన్ కమిటీలు పేరుకే..

యాంటీ ర్యాగింగ్, ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీలు పేరుకే ఉన్నాయని, అవగాహన చర్యలు కనిపించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జగిత్యాల జిల్లా ఎఎస్పీ వచ్చిన రోజు కాకుండా ఒక రోజు ముందుగా జరిగినట్లు సమాచారం, ఎస్పీ దృష్టికి విషయం రాకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు, యాజమాన్యం కలిసి నిఘా కెమెరాలు, భద్రతా వ్యవస్థను సమీక్షించాలంటున్నారు స్థానికులు. తల్లిదండ్రులు “ఇది ర్యాగింగ్ మొదటిదశ కాదు, మానసిక వేధింపుల దిశగా వెళ్తోంది వెంటనే చర్యలు తీసుకోవాలి” అంటున్నారు.

Also Read; Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

సీనియర్లు ఒత్తిడి..

జూనియర్లు అసభ్యకరంగా ప్రవర్తించేలా సీనియర్లు ఒత్తిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితిని అర్థం చేసుకొని తేలికగా తీసుకోకుండా ఇప్పటికైనా ర్యాగింగ్ ఆగేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు, కమిటీలు చట్టపరంగా అవగాహన కల్పించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యత వహించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

Also Read: Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

Just In

01

Bandi Sanjay: మజ్లిస్ అండతోనే కిడ్నాప్, అత్యాచారాలు.. కేంద్ర మంత్రి బండి సంచలన కామెంట్స్!

KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం..కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

D Mart Shopping Scam: డీమార్ట్‌‌ చేసే మోసాలు? బట్టబయలు చేసిన కస్టమర్లు.. ఫ్యూజులు ఎగరడం పక్కా!

RT76: భర్త మహాశయులకు ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏంటంటే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Home Remedies: చలికాలంలో జలుబు దగ్గు రాకుండా ఉండాలంటే ఈ పానీయాలు తాగండి!