MP Suresh Kumar: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటుందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ (MP Suresh Kumar) శెట్కార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన నూతన సర్పంచ్‌లు, డిప్యూటీ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం ముంగి చౌరస్తాలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ, నూతన ప్రజాప్రతినిధులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ సురేశ్ శెట్కార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల ప్రగతికి, గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సర్పంచ్‌లు ప్రజా సేవకు అంకితమై, తమ తమ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, పల్లెల అభివృద్ధికి నిరంతరం పాటుపడాలని పిలుపునిచ్చారు.
Also Read: Shyamala Devi: ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్‌పై ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు
కార్యకర్తలకు తోడుగా ఉంటాం
మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, రాష్ట్ర నేత ఎస్. ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటామని భరోసానిచ్చారు. గ్రామాల్లో నెలకొన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీ శ్రీనివాస్ రెడ్డి, పీ నర్సింహారెడ్డి, మక్సూద్, కే నర్సింలు, అస్మా తబస్సుమ్, మాజీ జడ్పీటీసీ కే భాస్కర్ రెడ్డి, కేతకీ ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బ్లాక్ ప్రెసిడెంట్స్ సామెల్, హర్షద్, నాయకులు సిద్ధిలింగయ్య స్వామి, శుక్లవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Inter Caste Marriages: కులాంతర వివాహాల్లో ఆ జిల్లానే టాప్.. ఒక్కో జంటకు రూ. 2.50 లక్షల ప్రోత్సాహకం!

