Seethakka: సమ్మక్క చిలకలగుట్ట పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత
Seethakka (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Seethakka: సమ్మక్క చిలకలగుట్ట పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది : మంత్రి సీతక్క!

Seethakka: ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర రూపుదిద్దుకుంటోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఆదివారం తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్‌లో శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 నిర్వహణపై పూజారులు, ఆదివాసి సంఘాల నాయకులు, జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాతో కలిసి ఆమె అభిప్రాయ సేకరణ సమావేశాన్ని నిర్వహించారు.

ఆదివాసీలతో కూడిన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేయాలి

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జాతర విజయవంతం కావడంలో పూజారులు, ఆదివాసి సంఘాల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. అనంతరం ఆదివాసి సంఘాల నాయకులు పలు విజ్ఞప్తులు చేస్తూ గిరిజన సంస్కృతి సంప్రదాయాల రక్షణకు ప్రత్యేక పాలసీ రూపొందించాలని, శాశ్వత ప్రాతిపదికన ఆదివాసీలతో కూడిన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రమైన మేడారం జాతర తరతరాలకు గుర్తుండిపోయేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకువచ్చే సమయంలో ఆదివాసి యువజన సంఘాలు సమన్వయం పాటించాలని సూచించారు. జాతర సమయంలో ఇసుక లారీలను పూర్తిగా నిలిపివేస్తామని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Seethakka: ఉపాధి హామీపై కేంద్రం పెత్తనం ఏంటి? మంత్రి సీతక్క ఫైర్!

చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో

ఆదివాసీ బీజాల సుందర శిల్పాలతో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు శాశ్వత చిరునామాగా నిలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటించారు. ఆలయ ప్రాంగణ ల్యాండ్ స్కేపింగ్, ప్రధాన ఆర్చి నిర్మాణ పనులు, జంపన్న వాగు స్నాన ఘట్టాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజా ప్రభుత్వం మేడారం జాతరను నిర్వహించడానికి సంకల్పించిందని తెలిపారు.

గుత్తేదారులపై కఠిన చర్యలు తప్పవు

జాతర పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనవరి 20న సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకుంటారని పొంగులేటి వెల్లడించారు. సీఎం ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ బస చేసి, మరుసటి రోజు ఆలయ పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. 200 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రాతి కట్టడాలను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 12లోపు క్యూ లైన్స్ షేడ్స్, సివిల్ వర్క్స్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. దేశ విదేశాల నుంచి వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Also Read: Minister Seethakka: గట్టమ్మ దేవాలయం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క

Just In

01

Boman Irani: మా ఆవిడకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. అందుకే ‘రాజా సాబ్’లో!

Ration Rice Scam: హుజూరాబాద్‌లో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా.. వామ్మో ఎన్నిక్వింటాల్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Drug Peddlers: డ్రగ్ పెడ్లర్ల నయా ఎత్తుగడ.. మైనర్లతో ఇలాంటి పనులా?

Manikonda Land Scam: స‌మాధుల‌ను సైతం వ‌ద‌ల‌ని క‌బ్జాకోరులు..? పట్టించుకోని అధికారులు

Prithviraj Shetty: యానిమల్, దురంధర్, కెజియఫ్‌లలో హీరోగా నేను చేస్తే బాగుండేది!