Indian Railways: భారతీయ రైల్వే గతంలో ఎన్నడూ లేని విధంగా విఫ్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే దేశంలో అత్యంత వేగవంతమైన వందే భారత్ రైళ్లకు శ్రీకారం చుట్టింది. గంటకు 160 కి.మీ దూసుకెళ్లే ఈ రైలు.. ప్రయాణికుల సమయాన్ని ఎంతగానో ఆదా చేస్తోంది. అయితే తాజాగా వందే భారత్ స్లీపర్ ను సైతం పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాత్రి వేళల్లో అత్యంత సౌకర్యవంతంగా పడుకొని ప్రయాణించేందుకు వీలుగా ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నెలలోనే తొలి వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే ఈ స్లీపర్ రైలుకు సంబంధించి మరో కీలక విషయం బయటకొచ్చింది.
ప్రాంతీయ వంటకాలు..
వందేభారత్ తొలి స్లీపర్ రైలు హౌరా – గౌహతి మధ్య నడవనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ధ్రువీకరించారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇందులో ప్రయాణించే వారి కోసం ఎంతో రుచికరమైన ప్రాంతీయ వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు. ఓ నివేదిక ప్రకారం.. కోల్ కతాలోని హౌరా నుంచి ప్రారంభమయ్యే రైలులో బెంగాలీ వంటకాలను ప్రయాణికులకు అందించనున్నారు. క్లాసిక్ బెంగాలి వంటకాలను తింటూ సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలు కల్పించనున్నారు.
బెంగాలి, అస్సామీ డిషెస్
కాగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్ గుండా ప్రయాణించే పలు రైళ్లలో బెంగాలీ వంటకాలను రైల్వే శాఖ అందుబాటులో ఉంచింది. ముర్గిర్ జోల్ (Murgir Jhol), కోషా పనీర్ (Kosha Paneer) లాంటి వంటకాలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని బెంగాలీ డిషెస్ ను సైతం వందే భారత్ స్లీపర్ రైలులో అందించాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు గౌహతి నుంచి మెుదలయ్యే వందే భారత్ స్లీపర్ లో సంప్రదాయ అస్సామీ వంటకాలు ఉండనున్నట్లు తాజా రిపోర్ట్ పేర్కొంది.
ఆ జిల్లాల వారికే ఛాన్స్!
కొత్త వందే భారత్ స్లీపర్ ట్రైన్ హౌరా – గౌహతి నగరాల మధ్య చక్కర్లు కొట్టనున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం అసోంలోని కమ్రూప్ మెట్రోపాలిటన్ (Kamrup Metropolitan), బొంగైగావ్ (Bongaigaon)తో పాటు పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ (Coochbehar), జల్పైగురి (Jalpaiguri), మాల్దా (Maldah), ముష్షిదాబాద్ (Murshidabad), పుర్బా బర్ధమాన్ (Purba Bardhaman), హుగ్లీ, హౌరా జిల్లాల ప్రయాణికులు.. రుచికరమైన ప్రాంతీయ వంటకాలను ఎంచక్కా తినొచ్చు. ప్రయోజనం చేకూరనుంది.
Also Read: Gas Leakage: కోనసీమలో అలజడి.. ఓన్‌జీసీ గ్యాస్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు
ఒక్కో టికెట్ రూ.2300!
రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. అసోంలోని గౌహతి నుంచి కోల్ కతాలోని హోరా వరకూ ప్రయాణించడానికి ప్రారంభ టికెట్ ధర రూ. 2,300గా ఉండనుంది. వందే భారత్ స్లీపస్ ఏసీ 3 టైర్ టికెట్ ధర రూ.2,000, ఏసీ 2-టైర్ ధర రూ. 3,000, ఏసీ వన్ ఛార్జీ రూ.3,600గా ఉండొచ్చని సమాచారం. వందే భారత్ స్లీపర్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టికెట్ ధరలపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

