Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి (Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన మెటీరియల్‌తో భారీ బజ్‌ను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్, పాటలు, టీజర్ ఇలా ఇప్పటి వరకు వచ్చిన ప్రతీది సినిమాపై భారీ అంచనాలు పెంచడమే కాకుండా.. రామ్‌కు ఈసారి గట్టిగా కొట్టబోతున్నాడనే హింట్‌ని ఇచ్చేస్తున్నాయి. నవంబర్ 28న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టి, యమా జోరుగా నిర్వహిస్తున్నారు.
Also Read- Bigg Boss Telugu 9: ట్రోఫీకి, ఎగ్జిట్‌కి దగ్గరగా ఉందెవరంటే? మళ్లీ తనూజ చేతుల్లోనే ఎలిమినేషన్!
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ రిలీజ్ అప్డేట్
హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడేలా చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో వారు చెప్పే విషయాలు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా? అని ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మరో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఆదివారం మేకర్స్ ఫోర్త్ సింగిల్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ విడుదల అప్డేట్ ఇచ్చారు. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సెలబ్రేషన్స్‌కి పర్ఫెక్ట్‌గా వుండే సాంగ్ అని తెలుపుతూ.. నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలుపుతూ.. రామ్ సెలబ్రేషన్స్ మోడ్‌లో వున్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- AR Rahman Concert: ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్‌లో ‘పెద్ది’ టీమ్.. ‘చికిరి చికిరి’కి సౌండ్ అదిరింది
ఈసారి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు..
ఈ సినిమా రామ్ కెరీర్‌కు ఎంతో కీలకమైనది. ఈ మధ్య వరుస పరాజయాల్లో ఉన్న రామ్.. తిరిగి లైన్‌లో నిలబడాలంటే, కచ్చితంగా ఈ సినిమా హిట్ కావాలి. ఇందులో హిట్ మెటీరియల్ ఉన్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది కాబట్టి.. ఈసారి రామ్, ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా కాలర్ ఎగరేసుకోవచ్చు. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో రియల్ లైఫ్ సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ వంటి వారంతా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ అండ్ మర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
