Ravi Teja BMW: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి ఈ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, స్టిల్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. రెండు రోజుల క్రితం వచ్చిన ‘వామ్మో వాయ్యో’ లిరికల్ సాంగ్ అయితే ఓ ఊపు ఊపేస్తుంది. మాస్ మసాలా ట్రీట్‌తో ఈ పాట సెన్సేషన్‌గా మారడంతో పాటు, సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్ చేస్తోంది. ఇదే హైప్‌ని సినిమా రిలీజ్ వరకు ఉంచడానికి చిత్రయూనిట్ మరో అప్డేట్ వదిలారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు.
Also Read- Poonam Kaur: అశ్లీల వీడియోలు రిలీజ్ చేస్తామని.. పూనమ్‌ని బెదిరించిన కడప వ్యక్తులెవరు?
ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..
ఈ అప్డేట్ ప్రకారం.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడు విడుదల కాబోతోంది అంటే.. ‘జనవరి 7వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు’ అని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌ని గమనిస్తే.. రవితేజ, ఆషికా రంగనాథ్ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటుంటే, పక్కనే ఉన్న డింపుల్ హయతి (Dimple Hayathi) అలిగినట్లుగా కనిపిస్తుంది. పోస్టర్‌లో రవితేజ గ్రేస్, ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) గ్లామర్ ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపు అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ట్రైలర్‌ను జనవరి 7న ఏఆర్‌టి సినిమాస్ మల్టీప్లెక్స్‌లో విడుదల చేయనున్నారు. సంక్రాంతికి భారీ పోటీ మధ్య ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ భారీ పోటీలో అందరి చూపు ఈ సినిమాపై ఉండాలంటే కచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. ఆ మ్యాజిక్‌ని ట్రైలర్ ఇస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. చూద్దాం.. మరి ట్రైలర్‌తో ఈ సినిమా రేంజ్ ఏ స్థాయికి చేరుతుందో..
Also Read- Sankranti 2026: ఇద్దరు భామలతో గ్లామర్ ప్రదర్శన మొదలెట్టారు.. పాపం చిరుకి ఆ ఛాన్స్ లేదుగా!
భోగి రోజునే..
వాస్తవానికి టీజర్‌తోనే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన పాటలు కూడా బాగానే ఎక్కేశాయి. మరీ ముఖ్యంగా ‘వామ్మో వాయ్యో’ సాంగ్ అయితే గ్లామర్ ట్రీట్ ఇచ్చేసింది. ఈ సాంగ్‌లో ఇద్దరు హీరోయిన్లు ఆరబోసిన అందాలు.. చూపరులను చూపుతిప్పుకోనివ్వడం లేదంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. రవితేజ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, స్వాగ్‌తో మెస్మరైజ్ చేయగా.. ఆషికా రంగనాథ్, డింపుల్ గ్లామర్‌తో పాటు గ్రేస్‌ఫుల్ డాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టేశారు. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే హుక్ స్టెప్స్, గ్రాండ్ విజువల్స్‌తో థియేటర్‌లో అదిరిపోయే పర్ఫెక్ట్ ఫెస్టివల్ సాంగ్‌గా ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీగా జనవరి 13, భోగి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
#BharthaMahasayulakuWignyapthi is bringing the festive vibes starting with the trailer 💥🪁
Wignyapthi 6 : The super entertaining #BMWTrailer out on January 7th at 4.05 PM💥⏳
Grand launch event at @ARTCinemasOffl🤩#BMW GRAND RELEASE WORLDWIDE ON JANUARY 13th, 2026.… pic.twitter.com/FPNVCkIQ2h
— SLV Cinemas (@SLVCinemasOffl) January 5, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

