Honda Elevate ( Image Source: Twitter)
బిజినెస్

Honda Elevate 2025: హోండా నుంచి కొత్త సర్ప్రైజ్.. ఎలివేట్ ADV ఎడిషన్ లాంచ్

Honda Elevate 2025: హోండా ఎలివేట్ ADV ఎడిషన్ లాంచ్ చేశారు. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో మన ముందుకొచ్చింది.  భారత ఆటోమొబైల్ మార్కెట్లో హోండా కార్స్ ఇండియా మరో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ప్రముఖ మిడ్-సైజ్ SUV “Honda Elevate” కి ప్రత్యేక రూపం ఇచ్చి ADV ఎడిషన్ పేరుతో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధరలు రూ. 15.29 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతున్నాయి.

హోండా ఎలివేట్ ADV ఎడిషన్ – ధరలు (ఎక్స్-షోరూం)

ADV Edition MT సింగిల్ టోన్ (Single Tone) ధర రూ. 15.29 లక్షలుగా ఉంది.

ADV Edition MT డ్యూయల్ టోన్ (Dual Tone) ధర రూ. 15.49 లక్షలుగా ఉంది.

Also Read: Telugu movies records: తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏంటో తెలుసా.. పుష్ప అనుకుంటే పొరపాటే..

ADV Edition CVT సింగిల్ టోన్ (Single Tone) ధర రూ. 16.47 లక్షలుగా ఉంది

ADV Edition CVT డ్యూయల్ టోన్ (Dual Tone) ధర రూ. 16.67 లక్షలుగా ఉంది.

ఈ ఎడిషన్ టాప్ ZX వేరియంట్ ఆధారంగా తయారు చేశారు. ఇది రెండు వేరియంట్లలో మనకి అందుబాటులో ఉంది. Meteoroid Gray Metallic, Lunar Silver Metallic. ఇవి సింగిల్ టోన్, డ్యూయల్ టోన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

Also Read: Robbery Gone Wrong: గోల్డ్ షాప్ ఓనర్ కళ్లలో కారంకొట్టి చోరీ చేద్దామనుకుంది.. కానీ చావుదెబ్బలు తిన్నది.. వీడియో ఇదిగో

దీనిలో కొత్తగా ఏముందంటే

హోండా ఎలివేట్ ADV ఎడిషన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన కాస్మెటిక్ అప్‌డేట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇందులో కొత్త ఆల్ఫా – బోల్డ్ ప్లస్ గ్రిల్ (ఆరెంజ్ యాక్సెంట్‌తో) బ్యాక్‌లిట్ ఇల్లుమినేటెడ్ IP గార్నిష్, బోనెట్, ముందు తలుపులపై డీకల్స్, అలాయ్ వీల్స్‌పై స్టికర్లు, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, రియర్ బంపర్ ఆరెంజ్ హైలైట్‌తో గార్నిష్, ఫెండర్ & టెయిల్‌గేట్‌పై ADV ఎంబ్లెమ్‌లు, ఇంటీరియర్ కూడా ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌లో ఆరెంజ్ కాంట్రాస్ట్ హైలైట్లు, ADV ఎంబాస్‌డ్ సీట్లు ఆరెంజ్ స్టిచింగ్‌తో, AC నాబ్స్, గేర్ నాబ్, డోర్ ట్రిమ్స్ పై ఆరెంజ్ టచ్‌లు ఉన్నాయి.

ఇంజిన్, పనితీరు

ఈ SUVలో 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (ప్యాడిల్ షిఫ్టర్స్‌తో) లలో దొరుకుతుంది.

Also Read: APSRTC – Google Maps: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. గూగుల్ మ్యాప్స్‌లో ఏపీఎస్ఆర్టీసీ టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి!

వారంటీ, సేవలు

హోండా ఈ మోడల్‌కు 3 సంవత్సరాల అనలిమిటెడ్ కిలోమీటర్ల వారంటీని స్టాండర్డ్‌గా ఇస్తోంది.
అదనంగా, ఎక్స్‌టెండెడ్ వారంటీ – 7 సంవత్సరాల వరకు,
ఎని టైం వారెంటీ – 10 సంవత్సరాల వరకు,
రోడ్సైడ్ అసిస్టెన్స్ సేవలు కొనుగోలు చేసిన తేదీ నుంచి లభిస్తాయి.

Just In

01

Donald Trump: టారీఫ్‌లు వ్యతిరేకించేవారు మూర్ఖులు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Telugu 9: ట్రోఫీకి, ఎగ్జిట్‌కి దగ్గరగా ఉందెవరంటే? మళ్లీ తనూజ చేతుల్లోనే ఎలిమినేషన్!

Jubilee Hills Bypoll: మూగబోయిన మైక్‌లు.. జూబ్లీహిల్స్‌లో ముగిసిన ప్రచారపర్వం

Temple hundi fire: కానుకలు వేసే హుండీలో కర్పూరం వేసింది.. ఓ భక్తురాలి అత్యుత్సాహం

Bandi Sanjay: ఆయన తండ్రే ఎం చేయలేక పోయిండు కొడుకు ఎం చేస్తాడు: బండి సంజయ్