Rahul Gandhi – H Files: గతేడాది అక్టోబర్ లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆ రాష్ట్రంలో 25 లక్షల ఓట్లు చోరికి గురైనట్లు పేర్కొన్నారు. ఓట్ల చోరికి సంబంధించి హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ.. అందుకు తగ్గట్లే తాజాగా ‘హెచ్ ఫైల్స్’ (H Files) పేరుతో మీడియా సమావేశం నిర్వహించారు. హర్యానాలో ప్రజల తీర్పును తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు.
5 పద్దతుల్లో ఓటు చోరి
దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. హర్యానాలో 25 లక్షల ఓట్ల దొంగతనం జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయన్న రాహుల్.. రియాలిటీకి వచ్చేసరికి ఫలితాలు తారుమారైనట్లు పేర్కొన్నారు. ఓవరాల్ గా 22 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైందని.. దీనంతటికి కారణం ఓటు చోరి కుట్ర మాత్రమేనని రాహుల్ ఆరోపించారు. హర్యానాలో మెుత్తం 5 పద్దతుల్లో ఓటు చోరి జరిగిందని రాహుల్ అన్నారు. డూప్లికేట్ ఓటర్లు, ఫేక్ ఓటర్లు, బల్క్ ఓటర్లు (ఒకే అడ్రస్‌తో ఉన్నవారు), ఫామ్ 6 ఓటర్లు (కొత్తగా నమోదైన వారు), ఫామ్ 7 దుర్వినియోగం ద్వారా ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసినట్లు చెప్పారు.
LIVE: #VoteChori Press Conference – The H Files https://t.co/IXFaH9fEfr
— Rahul Gandhi (@RahulGandhi) November 5, 2025
ఓట్ల చోరి లెక్కలు..
హర్యానాలో జరిగిన 25 లక్షల ఓట్ల చోరిలో.. 5.21 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. సరైన అడ్రస్ లేని ఫేక్ ఓటర్లు 40,009 మంది, 19.26 లక్షల మంది బల్క్ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,24,177 మంది ఓటర్ల ఫొటోలు ఒకేలా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. హర్యానా ఓటర్ల జాబితాలో నమోదైన ప్రతి 8 మందిలో ఒకరు నకిలీ ఓటర్ అని ఆరోపించారు. రాష్ట్రంలో 12.5 శాతం నకిలీ ఓట్లు ఉన్నట్లు చెప్పారు. హెచ్ ఫైల్స్ హర్యానా రాష్ట్రానికి సంబంధించినదని.. అయితే మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే తీరులో ఓట్ల చోరి జరిగినట్లు తమకు అనుమానం ఉందని రాహుల్ అన్నారు. హర్యానాలో తమ అభ్యర్థుల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయని.. అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఉన్నట్లు వారు చెప్పారని రాహుల్ తెలిపారు. ఇలాంటి అనుభవమే తమకు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రలో కూడా ఎదురైందని.. కానీ తాము హర్యానాపై దృష్టిసారించి అక్కడ ఏం జరిగిందన్న దానిపై లోతుగా పరిశీలించామని రాహుల్ వివరించారు.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "…We have crystal clear proof that 25 lakh voters (in Haryana) are fake, that they either don't exist or they are duplicate or are designed in a way for anybody to vote…1 in 8 voters in Haryana are fake, that's 12.5%…" pic.twitter.com/Tlo5wsTZyY
— ANI (@ANI) November 5, 2025
Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోరం.. చట్నీ మీద వేశాడని.. దారుణంగా పొడిచి చంపారు!
బ్రెజిల్ మోడల్ ఫొటోతో 22 ఓటర్ కార్డులు
హర్యానాలో ఓట్ల చోరికి ఇది ఒక ఉదాహరణ అంటూ బ్రెజిల్ మోడల్ మాథ్యూస్ ఫెర్రెరో ఫొటోను రాహుల్ గాంధీ స్క్రీన్ పై ప్రదర్శించారు. ఆమె ఫొటోను ఉపయోగించి.. స్వీటి, సీమ, సరస్వతి, రష్మీ, విల్మా వంటి పేర్లతో 22 ఓటర్ కార్డులను సృష్టించారని పేర్కొన్నారు. హర్యానాలోని రాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమె ఫొటోతో 10 బూతుల్లో నకిలీ ఓటును సృష్టించారని రాహుల్ ఆరోపించారు. హర్యానాలో కాంగ్రెస్ కు లభించాల్సిన భారీ విజయాన్ని ఇలా కుట్ర చేసి ఓటమిగా మార్చారని పరోక్షంగా బీజేపీ, ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపణలు చేశారు. దీనిని దేశ యువత, ముఖ్యంగా జెన్ జెడ్ (GenZ) గమనించాలని కోరారు. ఇది యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయమని.. తాను ఎన్నికల సంఘాన్ని, ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. 100 శాతం ఆధారాలతో ఓట్ల చోరీ కుట్రను బహిర్గతం చేస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. అయితే రాహుల్ గాంధీ విడుదల చేసిన హెచ్ ఫైల్స్ పై కేంద్రం, ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "…Congress lost the election by 22,000 votes…Who is this lady?…She votes 22 times in Haryana, in 10 different booths in Haryana. She has multiple names…That means this is a centralised operation…The lady is a Brazilian… pic.twitter.com/nWWXBPiKxC
— ANI (@ANI) November 5, 2025
