MLA Sanjay Kumar: డబ్బులు లేక తల్లిని మోసుకెళ్లిన కొడుకు
MLA Sanjay Kumar (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

MLA Sanjay Kumar: హృదయ విదారక ఘటన.. డబ్బులు లేక తల్లిని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొడుకు

MLA Sanjay Kumar: తల్లికోసం తల్లడిల్లిన తనయుని హృదయం తల్లడిల్లంది. జేబులో డబ్బులు లేక ఓ తల్లిని భుజాన మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు ఆ తల్లి కొడుకు దీంతో అక్కడి పరిస్థితి చూసి చలించిపోయి స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన కారులో తల్లీ కుమారుడిని తీసుకొని వారిని హస్పిటల్ కి తీసుకెల్లాడు ఎమ్మల్యే.. చికిత్స అనంతరం తిరిగి అదేకారులో తిరిగి బస్తాండులో దింపారు.

Also Read: Alcohol Survey: షాకింగ్.. మద్యం అధికంగా సేవిస్తున్న మహిళల్లో తెలంగాణ ర్యాంక్ ఎంతో తెలుసా?

ఇక పూర్తి వివరాల్లోకి వెలితే..!

అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు ఆ కొడుకు. ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు కనీసం డబ్బులు లేకపోవడంతో చేసేది ఏమి లేక తల్లిని మోసుకుంటూ ఆస్పత్రికి తరలించాడు ఆ కొడుకు జగిత్యాలలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆస్పత్రిలో చూపించడానికి నిజామాబాద్‌ నుంచి జగిత్యాలకు వచ్చిన దీపక్ తన జేబులో పైసా లేకపోయినా తన ప్రేమను చాటుకున్నారు.

మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉన్నందున తల్లిని తీసుకుని బస్టాండ్‌ వరకు వచ్చాడు కానీ ఆటోకు రూ. 50 రూపాయలు అడగగానే జేబు ఖాళీగా ఉండడంతో తల్లిని భుజాన వేసుకుని నడవసాగాడు. ఆ దృశ్యం చూసి వారి హృదయాలు కరిగిపోయాయి. ఆ సమయంలో అక్కడుగా వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఆ దృశ్యం చూసి కరిగిపోయారు. తన కారులో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి, చికిత్స పూర్తయ్యాక తిరిగి బస్టాండ్‌ వద్దకు చేర్పించారు. ఎమ్మెల్యే ఔదార్యం, కుమారుడి తల్లిపై ప్రేమపై జగిత్యాలలో చర్చ సాగింది. ప్రేమను చాటుకున్న కొడుకును, ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్యేను ప్రజలు అభినందించారు.

Also Read: Cyber Fraud: హర్ష సాయి పేరిట సైబర్ టోకరా.. ఇరాక్‌లో ఉన్న యువకుడికి రూ.87 వేలు మోసం!

Just In

01

BRS Party: గ్రామాల్లో గులాబీ జోరు.. సర్పంచ్ గెలుపులతో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును!

CPI Hyderabad: 100 ఏళ్ల సిపిఐ వేడుకలు.. జెండాలతో కళకళలాడిన నగరం!

Jupally Krishna Rao: ప్రతి జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం