Mohan Babu: 50 ఇయర్స్ ఇండస్ట్రీ.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే
Mohan Babu (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mohan Babu: ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే?

Mohan Babu: నటుడు, నిర్మాత, విద్యా వేత్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కలెక్షన్ కింగ్ డా. ఎం. మోహన్ బాబు (M Mohan Babu) ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ గ్రాండ్ సెలబ్రేషన్‌ను పురస్కరించుకుని నవంబర్ 22న ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారు. ఆయన చేసిన ఈ అసాధారణ జర్నీని గౌరవించుకునే క్రమంలో.. నవంబర్ 22న ‘MB50 – ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ (MB50, A Pearl White Tribute) అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ దిగ్గజ నటుడిని, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టంగా అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు (Vishnu Manchu) ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read- Bigg Boss Telugu 9: నేషనల్ క్రష్మిక ఎంట్రీ.. తనూజకు తలంటేసిన నాగ్.. గోల్డెన్ బజర్ ట్విస్ట్!

MB50 – ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్

దాదాపు ఐదు దశాబ్దాలుగా ఈ కలెక్షన్ కింగ్ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. తన శక్తివంతమైన నటనతో, ఐకానిక్ డైలాగ్ డెలివరీతో, తెరపై చూపించిన ప్రతిభ ఎందరికో స్పూర్ఫినిచ్చిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఆయన నటించిన సుమారు 600కి పైగా చిత్రాలు.. మోహన్ బాబు బహుముఖ ప్రజ్ఞ, క్రమశిక్షణ, కళ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని చాటుతాయి. ‘MB50’ అంటే కేవలం సినీ విజయాలే కాకుండా.. కళ, విద్య, దాతృత్వం పట్ల ఆయన జీవితాంతం చూపిన నిబద్ధతను కూడా సూచించేలా ఈ ఈవెంట్ ఉంటుందని విష్ణు అండ్ టీమ్ చెబుతోంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, ఒంటరిగా సినీ ప్రయాణం మొదలు పెట్టి.. విలక్షణ నటుడుగా ఈ రోజు తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న ఈ జర్నీ గురించి అందరికీ మరోసారి చాటి చెప్పేలా ఈ ‘MB50 – ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read- Telugu Indian Idol Season 4: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 విన్నర్ ఎవరంటే?

‘స్వర్గం-నరకం’తో హీరోగా ఎంట్రీ

మోహన్ బాబు ఇలా ఇండస్ట్రీలో స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా విష్ణు మంచు నిర్వహించబోతోన్న ఈ ‘MB50 – ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ కార్యక్రమానికి సంబంధించిన ఇతర విషయాల్ని త్వరలోనే వెల్లడించనున్నారు. మోహన్ బాబు విషయానికి వస్తే.. ఆయన సినీ జీవితం ఒక ప్రయోగం అనే చెప్పాలి. 1974లో శోభన్‌బాబు హీరోగా నటించిన ‘కన్నవారి కలలు’ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన మోహన్ బాబు, ఆ తర్వాత దిగ్దర్శకుడు దాసరి నారాయణ రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, ఆయన దర్శకత్వం వహించిన ‘స్వర్గం-నరకం’ (1975) సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మోహన్ బాబు భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. ఎంతో మందికి ఆయన లైఫ్ ఇచ్చారు. మోహన్ బాబు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చెప్పొచ్చు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Ramchander Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు బీజేపీ రాంచందర్ రావు ప్రశ్న ఇదే

Bhatti Vikramarka: తెలంగాణలో అత్యధిక ప్రజావాణి అర్జీలను పరిష్కరించిన కలెక్టర్‌.. ఎవరో తెలుసా..?

New Sarpanch: ఎలుగుబంటి వేషంలో నూతన సర్పంచ్.. కోతుల సమస్యకు చెక్!