Private Travel Bus ( image credit: free or twitter)
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Private Travel Bus: రూల్స్ పాటించని ప్రైవేట్ బస్సులు.. సురక్షిత ప్రయాణానికి భరోసా ఏది?

Private Travel Bus: ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. రూల్స్‌ను పాటించకుండా ఉండేందుకు ఏజెన్సీల మాఫియా నెలనెలా కోట్లాది రూపాయల ముడుపులు ఇస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. లంచాలు తింటుండటంతో ప్రయాణికుడి రక్షణ గాల్లో కలిపేస్తున్నారు. ఘోర ప్రమాదాలు జరిగినప్పుడే తూతూ మంత్రంగా నిబంధనలు గుర్తు చేస్తారు. ఆ తర్వాత ‘రూల్స్, గిల్స్ జాన్తా నై’ అంటున్నారు. ఒక్కొక్క ట్రిప్‌కు రూ.30 వేలు అదనంగా ఆదాయం చేకూర్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. నెలకు బస్సుకు రూ.10 వేల చొప్పున ఒక్కొక్క రాష్ట్ర మంత్రికి చేరవేసి, మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇల్లీగల్ బిజినెస్ పెంచిపోషించుకుంటున్నారు.


Also Read: Wines Lucky Draw: అరచేతిలో అదృష్ట లక్ష్మీ.. ఒకే ఇంట్లో ఇద్దరికి లక్కీ కిక్కు..?

టూరిస్టుల పేరుతో ఖజానాకు గండి

దేశంలో టూరిస్టుల ప్రయాణానికి ఇంటర్ స్టేట్ పర్మిట్ల ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందే ‘వన్ నేషన్ వన్ పర్మిట్’. ఇది నిర్దిష్ట రూట్‌ను ఎంచుకుని, అదే రూట్‌లో ఆయా రాష్ట్రాలను దాటుకుంటూ వెళ్లాలి. కానీ, మన తెలుగు ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు దాన్ని అడ్డుపెట్టుకుని స్టేజీ క్యారేజ్ ప్యాసింజర్స్‌ను నడుపుతున్నారు. ఆయా రాష్ట్రాల బోర్డర్‌లో చెల్లించాల్సిన ట్రిప్ డబ్బులు చెల్లించడం లేదు. ఒక్కొక్క సీట్‌కు ఆయా రాష్ట్రాల వారీగా పర్మిట్ రుసుం చెల్లించాలి. కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఈ రూల్స్‌ను పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నెలనెలా రవాణా శాఖ మంత్రులకు మామూళ్లు పంపించడంతో ఆ శాఖ అధికారులు టూరిస్టుల పేరుతో వదిలేస్తున్నారని తెలుస్తున్నది.


ఒక్క బస్సు సుమారు రూ.2 వేలు ఇంటర్ స్టేట్ ఛార్జీలు

మూడు నెలలకు ఒక్కసారి సీటుకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. రోజుకు ఒక్క బస్సు సుమారు రూ.2 వేలు ఇంటర్ స్టేట్ ఛార్జీలు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 600 బస్సులకి నెలకు రూ.3 కోట్లు వసూలు చేసి ప్రభుత్వ ఖజానా నింపాల్సి ఉంది. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే గుర్తు చేసుకుని రూ.2 వేలు ఫైన్ వేసి వదిలేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ఓ ఎంపీ కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌కు చెందిన ఓ నేతకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది. అతనే మంత్రికి ఇటు అధికారులకు మధ్యవర్తిత్వంగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా నెలకు రూ.60 లక్షలు చేతులు మారుతున్నందున దాడులు చేయడం లేదని తెలుస్తున్నది. నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ప్యాసింజర్ వెహికిల్‌లో కార్గో?

ముంబై, విజయవాడ, బెంగళూరు లాంటి ప్రాంతాలకు రోజు ట్రావెల్ బస్సులు వెళ్తుంటాయి. అందులో ప్యాసింజర్ సామాగ్రి పేరుతో గూడ్స్ రవాణా చేస్తుంటారు. ఇలా బస్సుపైనా, కింద అంటూ ఒక టన్ను వరకు సరుకులు రవాణా చేస్తుంటారు. మొన్న బస్సు ప్రమాదంలో 250 సెల్ ఫోన్స్ కాలి బూడిద అయ్యాయి. ఇలా ఎన్నో సరుకులు మనుషులు లేకుండానే పంపిస్తుంటారు. దీంతో ట్రిప్‌కు రూ.30 వేల వరకు సంపాదిస్తారు. అవే ప్రమాదాలకు కారణాలు అయిన సంఘటనలు ఉన్నాయి. ఇల్లీగల్ పార్సెల్స్ కూడా వెళ్తుంటాయని విమర్శలు ఉన్నాయి. ఇలా అక్రమ సరకు రవాణా చేస్తే రూ.10 వేల వరకు పెనాల్టీలు వేయాలి. కానీ ఏనాడు ఆయా రాష్ట్రాల ఆర్టీఏ అధికారులు పట్టించుకోలేదు. నిత్యం ఫొటోలతో ఫైన్స్ వేసే ట్రాఫిక్ పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదని ఆరోపణలు ఉన్నాయి.

అసలు స్టేజ్ క్యారేజీ ఉన్నట్లా.. లేనట్లా..?

ప్రైవేట్ బస్సు ఏజెన్సీలు ఒకే చోట నుంచి ప్రయాణికులను తీసుకెళ్లాలి. ఆర్టీసీ లాగా ఒక్క స్టేజీ అంటూ ఉండదు. అలా తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లేదు. కానీ కొత్త కొత్త యాప్‌లతో నగరంలో ఏ చోటనైనా ట్రావెల్ బస్సు రాత్రి 10 గంటలకు ఆగుతుంది. వందల ఏరియాలను స్టేజ్ క్యారేజీలుగా ఉపయోగించుకుంటున్నారు. ఈ పద్ధతికి అనుమతి ఇచ్చినా ప్రభుత్వానికి ఖజానా పెరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు, ఒడిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ స్టేజీ క్యారేజీ ఉంది. కానీ మన తెలంగాణలో కనీసం టూరిజం బస్సులకు కూడా స్టేజీ క్యారేజీకి అధికారిక జీవో లేకుండానే వారికి ఇష్టం వచ్చిన చోట ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం అనుమతి ఇచ్చైనా లీగల్‌గా ఉండేలా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నది.

సురక్షిత ప్రయాణానికి భరోసా ఏది?

వ్యవస్థలను మేనేజ్ చేసి, ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం అని భరోసా కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కఠినమైన చట్టాలు ఉన్నా, ఫైన్స్ వేసి చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికైనా స్లీపర్స్ అంటూ, లగ్జరీ అంటూ లగేజ్ తీసుకెళ్లడం, టూరిస్టుల పేర్లతో ప్రయాణికులుగా ఛార్జీ చేయడం మానుకోవాలి. ఈ మాఫియాలకు అండగా ఉండే అధికారులను, రాజకీయ నేతలను ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ప్రయాణికుడికి రావాలి. చట్టం, రూల్స్ ఏంటో ప్రతి బస్సులో తెలిసేలా ప్రైవేట్ బస్సులో బోర్డులు ఏర్పాటు చేయాలి.

Also Read: Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Just In

01

Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

Premante Teaser: పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా సుమ.. ‘ప్రేమంటే’ టీజర్ ఎలా ఉందంటే?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన యాంగ్రీమ్యాన్!

Crime News: మూడు రోజుల్లో వీడిన హత్య కేసు మిస్టరీ.. ఎలా పసిగట్టారంటే?