Konda Surekha: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎకో పార్క్(Eco Park), పార్కు కాటేజీలను శనివారం అటవీ, దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ప్రారంభించారు. తెలంగాణ(Telangana)లోని ఒక అరుదైన పార్కును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎకో పార్క్ వంటి ప్రాజెక్టులు కొత్త తరానికి స్ఫూర్తినందించే విధంగా ఉంటాయన్నారు. ఇది యువతీ యువకులకు ప్రకృతి ప్రేమను అలవరించడంలో దోహద పడుతుందని చెప్పారు. పార్కులో అరుదైన మొక్కలు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. పార్కులో ఏర్పాటు చేసిన వేదికలు, లగ్జరీ సదుపాయాలు, పిక్నిక్ స్పాట్స్, ఈవెంట్స్ నిర్వహించుకునే ఫెసిలిటీలు, పచ్చదనం లాంటివి అన్ని సందర్శకులను ఆకట్టుకుంటాయనీ తెలిపారు.
వందేమాతరం గీతంలో..
కుటుంబ సభ్యులతో సహా పర్యావరణాన్ని ఆస్వాదించాలనుకునే ప్రతిఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన పార్కుగా ఇది రూపుదిద్దుకుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) మాట్లాడుతూ వందేమాతరం గీతం లోని సుజలం,సుపాలం, మలయజ సీతలాం పదాలలో లోని ఏదీ ఒకటి అమలవుతలేదని అన్నారు. ఎకో పార్కు చెరువు డంపింగ్ యార్డ్(Dumping yard) కావద్దన్నారు.గ్రామాలు పిలుస్తున్నాయీ అనే నినాదం రావాలన్నారు.ప్రకృతిని ప్రేమించాలని, కాలుష్యం తగ్గించాలని,పార్కు నిర్వాహకులకు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి అడవి ఒక ఆస్తి, వరం అన్నారు.
Also Read: Women Harassment: నెలసరి ఉన్నట్టుగా నిర్ధారణ కోసం ఫొటోలు తీసి పెట్టాలట.. యూనివర్సిటీలో దారుణం
ఈ కార్యక్రమంలో..
పార్క్ వల్ల నర్సాపూర్ కు మరింత గుర్తింపు వస్తుందన్నారు . సెలవుల్లో కుటుంబ సభ్యులతో గడపడానికి, ఆహ్లాదంగా ఉండడానికి ఈ పార్కు దోహదపడుతుందన్నారు. నర్సాపూర్ లో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఆపి,నియోజక వర్గ అభివృద్ధి కి సహకరించని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రెటరీ పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ హమ్మద్ నదీమ్ ,ప్రధాన అటవీ సంరక్షణ అధికారి,సువర్ణ, ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రియాంక వర్గీస్,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్,మృగవని గ్రూప్ ఆఫ్ రిసార్ట్స్ ఎండి ,విష్ణు చైతన్య రెడ్డి ,జిల్లా అటవీ అధికారి జోజీ, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ,ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ponnam Prabhakar: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు
