Warangal District: గన్ కల్చర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గన్ చూపెట్టి ఓ ముఠా దారి దోపిడీలు, దౌర్జన్యాలు పాల్పడుతున్నట్టు సమాచారం. హనుమకొండ(Hanunakonda) జిల్లా శాయంపేట మండలం మందారిపేట సమీపంలో లారీ డ్రైవర్ పై దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. గన్ చూపెట్టి లారీ ఆపి డ్రైవర్ను కొట్టి డబ్బులు ముఠా లాక్కోగా గాయపడ్డ డ్రైవర్ పోలీసులకు వివరాలు తెలిపినట్లు సమాచారం.. హైదరాబాద్ లో పిస్తోలు కొనుగోలు చేసిన ముగ్గురు యువకులతో ఏర్పడిన ముఠా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
జిల్లా కేంద్రానికి చెందినవారుగా..
యువకులు ములుగు(Mulugu) జిల్లా కేంద్రానికి చెందినవారుగా సమాచారం నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. నిందితుల్లో ఒకరు హనుమకొండ(Hanumakonda), మరో ఇద్దరు ములుగు(Mulugu) జిల్లా కేంద్రంలో పట్టుబడ్డట్లు పోలీసులు సమాచారం.
పెట్టేగుతున్న రౌడీ మూకలు
మునుపెన్నడు లేని విధంగా క్రైమ్(Crime) తిరు మారుతుందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పలు నేరాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైన పోలీస్ శాఖ ఇటువంటి నేర చరిత్ర కలిగిన వారి పట్ల అప్రమత్తంగా ఉండి. వారి ఆటలు కట్టించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్.. మెట్రోకు సమాంతరంగా రెండు ఫ్లై ఓవర్లు!
