India-Vs-Australia (Image source Twitter)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

India vs Australia: రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం

India vs Australia: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్ మైదానం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓడిపోయింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో టీమిండియాపై థ్రిల్లింగ్ విక్టరీ (India vs Australia) సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్దేశించిన 265 పరుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఆస్ట్రేలియా చేధించింది.

ఆసీస్ గెలుపులో మ్యాథ్యూ షార్ట్ (74), కూపర్ కాన్లీ (61) కీలక పాత్ర పోషించారు. తొలి మ్యాచ్‌తో పోల్చితే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కాస్త ఫర్వాలేదనిపించినప్పటికీ, కీలకమైన సమయాల్లో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. దీంతో, ఆసీస్ బ్యాటర్లు క్రమంగా లక్ష్యాన్ని చేరుకున్నారు.

ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 11 పరుగులు, ట్రావిస్ హెడ్ 28, మ్యాథ్యూ షార్ట్ 74, మ్యాట్ రెన్షా 30, అలెక్సీ క్యారీ 9, కూపర్ కాన్లీ 61 (నాటౌట్), మిచెల్ ఒవెన్ 36, జావీయర్ బార్లెట్ 3, మిచెల్ స్టార్క్ 4, ఆడమ్ జంపా 0 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు. చివరిలో ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కూపర్ కాన్లీ జాగ్రత్తగా ఆడి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చారు. కాన్లీ మొత్తం 53 బంతులు ఎదుర్కొని 61 పరుగులు బాదాడు. ఇందులో ఒక సిక్సర్, 5 ఫోర్లు ఉన్నాయి. ఇక భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ తలో రెండేసి వికెట్లు తీశారు. పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ పడింది.

Read Also- Kalvakuntla Kavitha: గ్రూప్-1 నియామకాలపై కవిత సంచలనం.. సుప్రీంకోర్టు సీజేఐకి బహిరంగ లేఖ

మెరిసిన రోహిత్ శర్మ

భారత బ్యాటింగ్ విషయానికి వస్తే, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మెరిశాడు. 93 బంతులు ఎదుర్కొని 73 పరుగులు బాదాడు. ఇందులో 2 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే, కెప్టెన్ శుభ్‌మన్ 9 పరుగుల స్వల్ప స్కోరుకే ఔటయ్యి మళ్లీ నిరాశపరిచాడు. ఇక, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అంచనాలు తప్పాడు. వరుసగా రెండవ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

మిగతా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 61, అక్షర్ పటేల్ 44 ఇద్దరూ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. కేఎల్ రాహుల్ 11, వాషింగ్టన్ సుందర్ 12, నితీష్ కుమార్ రెడ్డి 8, హర్షిత్ రాణా 24 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 13, మహ్మద్ సిరాజ్ 0 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి భారత్ 264 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 8 వికెట్లు నష్టపోయి 46.2 ఓవర్లలో 265 పరుగులు చేసింది.

Read Also- Jagan on Balakrishna: ఎంతపెద్ద మాట సార్.. బాలకృష్ణపై జగన్ షాకింగ్ కామెంట్స్!.. కౌంటర్ ఇస్తాడా?

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?