Perth ODI: భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదలైన మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి ఎదురైంది. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన ఈ వన్డేలో (Perth ODI) భారత్‌పై ఆతిథ్య ఆసీస్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను వర్త్ లూయిస్ పద్ధతిలో 26 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 26 ఓవర్లలో 136 పరుగుల స్కోర్ మాత్రమే సాధించింది.
ఈ సునాయాస లక్ష్యాన్ని ఆసీస్ ఆటగాళ్లు సులభంగా ఛేదించారు. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ చేరుకుంది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగతా ఆసీస్ బ్యాటర్లలో జోష్ ఫిలిప్ 37, మ్యాట్ రెన్షా 21 (నాటౌట్), ట్రావిస్ హెడ్ 8, మ్యాథ్యూ షార్ట్ 8 చొప్పున పరుగులు సాధించారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.
Read Also- Perth ODI: ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓటమి.. రోహిత్, కోహ్లీ ఎలా ఆడారంటే?
భారత్ స్కోర్ బోర్డ్
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో తలబడ్డారు. ముఖ్యంగా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ స్వల్ప స్కోరుకు, విరాట్ కోహ్లీకి సున్నా పరుగులకే వెనుదిరిగారు. రోహిత్ శర్మ 8, శుభ్‌మన్ గిల్ 10, విరాట్ కోహ్లీ 0, శ్రేయస్ అయ్యర్ 11, అక్షర్ పటేల్ 31, కేఎల్ రాహుల్ 38, వాషింగ్టన్ సుందర్ 10, నితీష్ రెడ్డి 19 (నాటౌట్), హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ 0, మహ్మద్ సిరాజ్ 0 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. పిచ్ బౌలింగ్‌కు సహకరించడంతో ఆసీస్ బౌలర్లు చెలరేగారు. హేజెల్‌వుడ్, మిచెల్ ఒవెన్, ఎం కున్హేమాన్ తలో రెండేసి వికెట్లు, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లీస్ చెరో వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ (అర్షదీప్ సింగ్) రనౌట్ రూపంలో దక్కింది.
Read Also- Indian Boycott: టర్కీ, అజర్‌బైజాన్‌లకు బుద్ధి చెబుతున్న భారతీయులు.. ఏం చేస్తున్నారో తెలుసా?
అంచనాలు అందుకోలేకపోయిన స్టార్లు
పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అంచనాల్ని అందుకోలేకపోయారు. రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆరంభించినప్పటికీ, ఆస్ట్రేలియా పేసర్ల ముందు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. స్వింగ్‌తో దూసుకొచ్చిన బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ 14 బాల్స్ ఎదుర్కొని 8 పరుగులు మాత్రమే సాధించి ఔటయ్యాడు. ఇక, విరాట్ కోహ్లీ కూడా తన క్లాస్‌కు తగ్గ ఆటతీరు కనబరచలేకపోయాడు. 8 బంతుల్లో కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు. వీద్దరి వికెట్లు త్వరగా పడిపోవడంతో టీమిండియా టాపర్డర్ త్వరగా కుప్పకూలినట్టు అయింది. ఆ ప్రభావం మిగతా బ్యాటర్లపై కూడా పడిందని చెప్పవచ్చు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ మోస్తరుగా రాణించడంతో టీమిండియా 136 పరుగులైనా చేయగలిగింది. లేదంటే, మరింత చతికిలపడి ఉండేది.
