NIMS Hyderabad: విద్యార్థి మృతికి ఉద్యోగులే కారణమా?.. నిమ్స్‌
NIMS Hyderabad ( image credit: twitter)
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

NIMS Hyderabad: విద్యార్థి మృతికి ఉద్యోగులే కారణమా?.. నిమ్స్‌పై స్వేచ్ఛ వరుస కథనాలు

NIMS Hyderabad: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పదేళ్లు పాలించి అనేక అక్రమాలకు పాల్పడినట్టు విమ ర్శలను మూటగట్టుకున్నది. ఎన్నో స్కాముల్లో బీఆర్ఎస్ పెద్దల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణ లున్నాయి. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కా ళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ల్యాండ్ వివాదాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే. తాజాగా బోగస్ ఉద్యోగాల అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ విచా రణలో ఈ విషయం వెలుగుచూడగా, నకిలీ ఉద్యోగుల పేరుతో పదేళ్లు రూ.10 వేల కోట్లు దండుకున్నట్టు తేలింది.


Also Read:NIMS Fire Incident: అగ్నిప్రమాదంపై ఆధారాలు లేవా? దర్యాప్తుపై అనుమానాలు

జీతాల పేరుతో

బీఆర్ ఎస్ ప్రభుత్వంలో  పలు శాఖల్లో భారీగా బోగస్ ఉద్యోగులు ఇచ్చినట్టు విచా రణలో బయటపడింది. నెలనెలా జీతాలు తీసుకుంటూ వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు తేలింది. ప్రభుత్వ విభాగాలు, పలు శాఖల్లో దాదాపు లక్ష మంది బోగస్ ఉద్యోగులున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిం చింది. బీఆర్ఎస్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ బోగస్ ఉద్యోగుల స్కాంతో గడిచిన పదేళ్లలో  రూ.10 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి  పడినట్టు తెలుసుకున్నది.


కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ అంటూ

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్ట్ మ్యాన్ పవర్ కంపెనీలు ఏర్పాటు చేసిన కొందరు నాయకులు, బడాబాబులు బోగస్ ఉద్యోగుల ను సృష్టించి డబ్బంతా దోచుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఉద్యోగుల లిస్టులో పేర్లు ఉంటాయి. కానీ వారంతా విధులకు హాజరు కారు. కానీ, నెలనెలా జీతాలు మాత్రం తీసుకునేవారు. ఇలా పదేళ్లు వేల కోట్లు దండుకున్నారు. త్రిసభ్యకమిటీ విచారణతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

త్రిసభ్య కమిటీ విచారణ

మాజీ సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో వేసిన త్రిసభ్య కమిటీ రిపోర్టులో ఈ వాస్తవాలు బయ టపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు తేల్చిన కమిటీ, అందులో కేవలం 2 లక్షల మంది పూర్తి స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. సెప్టెంబ ర్ 30 వరకు సగం మంది ఉద్యోగులు మాత్రమే బ్యాంక్ ఖాతాలు, ఆధార్ వివరాలు ఇచ్చారు. మిగిలిన వారు అక్టోబర్ 25 వరకు ఆధార్ వివ రాలివ్వాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, వీరిలో లక్ష మంది పేర్లతో భారీగా డబ్బులు దోచుకున్నట్టు నిర్ధారించారు. రిపోర్ట్  నేపథ్యంలో బోగస్ ఉద్యోగుల జీతాలు అక్టోబర్ నుంచి నిలిపివేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.

నిమ్స్ నైట్ డ్యూటీలకు విద్యార్థులే వైద్యులా?

నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో నితిన్ అనే వైద్య విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇతను అవస్థీషియా విభాగంలో విధులకు హజరయ్యాడు. ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి కనిపించాడు. కాంట్రాక్ట్ ఉద్యోగులు హాజరుకాకపోవడంతో విద్యార్థులను విధులకు పంపించడం జరుగుతున్నది. ఈ క్రమంలో వారు పని ఒత్తిడికి గురవుతున్నారు. నితిన్ కూడా చనిపోవడానికి ముందు 24 గంటలపాటు పని చేసి పని ఒత్తిడికి గురై ఆపరేషన్స్ అయిపోయాక నిద్ర పట్టేందుకు ఇంజెక్షన్ తీసుకున్నట్టు తెలుస్తున్నది.

గతంలో నిమ్స్ లో ఒక ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి

ఈ వ్యవహారాన్ని దాచి పెట్టేందుకు నిమ్స్ అంతా తానే అనుకుంటున్న లక్ష్మీ భాస్కర్ కనీసం పట్టించుకోకుండా, సాయభూతగా విద్యార్థులను, కాంట్రాక్ట్ ఉద్యోగులను మృతదేహం వద్దకు రాకుండా అడ్డుకున్నట్టు సమాచారం. గతంలో నిమ్స్ లో ఒక ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందితే, ఆపరేషన్ థియేటర్ తోపాటు అన్ని సేవలు నిలిపివేసి సంతాపం ప్రకటించారు. ఇలా రోజురోజుకు నిమ్స్ లో వ్యవస్థ దిగుతున్నది. ఈ పరిణామాలపై ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో నిమ్స్ చైర్మన్ అయిన సీఎం దృష్టి సారించి మొత్తాన్ని ప్రక్షాళన చేస్తూ, కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో జరుగుతున్న స్కాములను వెలికి తీసి, తెలంగాణ పారామెడికల్ ఉద్యోగులకు, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Also Read:NIMS Hospital: కరోనాలో నిమ్స్​ ఆస్పత్రిలో బెడ్ల దందా.. కృష్ణారెడ్డి ఫిర్యాదుతో వెలుగులోకి? 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..