Swetch-Story
లేటెస్ట్ న్యూస్, లైఫ్‌స్టైల్

Swetcha Special: అలసిపోయి ఆగిపోతున్న గుండెలు.. వైద్యుల సూచనలు ఇవే!

Swetcha Special: గుండెపోటుతో పెరుగుతున్న మరణాలు

ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన
అప్రమత్త అవసరం.. జాగ్రత్తలు ముఖ్యం
ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచిస్తున్న వైద్యులు
గుండెపోటుపై అవగాహన కల్పిస్తూ ‘స్వేచ్ఛ ప్రత్యేక కథనం’

వరంగల్, స్వేచ్ఛ: వయసుతో సంబంధం లేదు.. చిన్న పెద్ద అనే తేడా లేదు. నిత్యం పని చేయాల్సిన గుండెలు అలిసిపోయి అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. వాకింగ్ చేస్తూ… జిమ్ చేస్తూ… చక్కగా ఆడుతూ పాడుతూనే హఠాన్మరణం చెందుతున్నారు. ప్రథమచికత్సకు కూడా సమయం ఇవ్వకుండానే గుండె పోటు రూపంలో ప్రాణాలు హరిస్తున్నాయి. ఏమైంది అనే విషయం తెలుసుకునే లోపే ఈ లోకాన్ని విడిచివెళ్ళే పరిస్థితి వస్తుంది. వైద్య రంగంలో అధునాతన వైద్య సేవలు పెరుగుతున్న గుండెపోటు భారీ నుంచి బయట పడే పరిస్థితి లేకుండా పోతుంది. ఇటీవలే పేరుమోసిన ఓ గుండె డాక్టర్ రోగులను పరీక్షిస్తూనే గుండె పోటు బారిన పడి మృతి చెందిన సంఘటన విస్మయానికి గురి చేస్తుంది. సమీపంలో వైద్య సేవలు అందుబాటులో ఉంది సకాలంలో వైద్య సేవలు అందితే కొందరు ప్రాణాలతో బయట పడుతున్నారు. వైద్య సేవలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో మరణాల సంఖ్య పెరుగుతుంది. గుండె పోటు మరణాలపై ‘స్వేచ్ఛ’ ప్రత్యేక (Swetcha Special) కథనం….

పెరుగుతున్న హార్ట్ ఎటాక్‌లు

రోజు రోజుకు హార్ట్ ఎటాక్‌తో మృతి చెందే వారి సంఖ్య పెరుగుతోంది. సరదాగా కుటుంబంతో గడుపుతూ, వాకింగ్ చేస్తూ, వ్యాయామం చేస్తూ, ఆటలాడుతూ మాట్లాడుతూనే కుప్పకూలిపోతున్నారు. రెండు రోజుల వ్యవధిలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో 8 మందికి పైగా గుండెపోటుతో మృతి చెందారు. ఇక, రాష్ట్రం ఈ సంఖ్య ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో రాజు అనే హమాలి కార్మికుడు (43) పని చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. చింతనెక్కొండకు చెందిన సహస్ర (28) అనే యువతి గుండెపోటుతో మృతి చెందింది. దౌలత్ నగర్‌కు చెందిన ప్రైవేట్ లెక్చరర్ తిరుమలేష్ (40) గుండెపోటుతో మృతి చెందారు. జ‌న‌గామ జిల్లా దేవ‌రుప్పుల మండ‌ల‌ ఉపాధి హామీ ప‌థ‌కం ఏపీవో క‌మ్మ‌గాని శ్రీ‌నివాస్ (48) వాకింగ్ చేస్తూ ఛాతిలో నొప్పి వ‌స్తున్నట్టు గ్ర‌హించి క‌స్తూర్భా పాఠ‌శాల స‌మీపంలో మోరీపై కూర్చున్నాడు. గుండెపోటు రావ‌డంతో అక్క‌డే కుప్ప‌కూలి మృతి చెందారు. పోలీస్ అధికారుల సంఘం స్థాపించిన ఏసీపీ విష్ణుమూర్తి గుండెపోటుకు గురై మృతి చెందారు. ఇలా గత ఆరు నెలల కాలంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుండె మరణాలు పెద్ద సంఖ్యలోనే నమోదయ్యాయి.

Read Also- Travel Date Change: రైల్వేస్ నుంచి ఊహించని గుడ్‌న్యూస్.. ఇకపై టికెట్ కన్మార్ఫ్ అయ్యాక కూడా..

గుండెపోటుపై పెరుగుతున్న అపోహలు

వరుసగా గుండెపోటు బారిన పడి మృతి చెందే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వరుసగా గుండెపోటు రావడంపై ప్రజల్లో అనేక అపోహలు పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ప్రభావంతో ఇలా జరుగుతుందా? అనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఈ అంశాన్ని వైద్య నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గుండెపోటుకు వ్యాక్సిన్‌కు సంబంధం లేదని వైద్యులు తేల్చి చెబుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఆరోగ్యకరమైన వ్యక్తులలో కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావడం పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటుకు గుండె సంబంధిత రక్తనాళాల అడ్డంకులు, పూడికలు కారణమవుతాయని, అనేక కారణాల వల్ల గుండెపోటులు సంభవించవచ్చని వైద్య నివేదికలు చెబుతున్నాయి. అరుదుగా, భారీ బరువులు ఎత్తే వ్యక్తులలో ఇది సంభవించవచ్చు, దీని వలన అవయవాలకు రక్త సరఫరా ఆగిపోయి హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందే ఛాన్స్ ఉంది.

Read Also- GHMC: కుర్చీ ఖాళీ కాకముందే, ఆ పోస్టింగుల కోసం జీహెచ్ఎంసీలో పైరవీలు!

గుండెపోటుకు (హార్ట్ ఎటాక్) కారణాలు

గుండెలోని రక్త కణాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు కలగడం లేదా రక్తనాళాలు పూడికపోవడం వల్ల గుండెకు సరిపడ సరైన మొత్తంలో రక్తాన్ని పొందలేదు. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ధూమపానం, అధిక కొవ్వు పదార్థాలు సేవించడం వంటివి గుండెపోటు రావడానికి కారణాలు అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చక్కర(మధుమేహం) వ్యాధిగ్రస్తులు, వృద్ధులు ఎలాంటి నిర్ధిష్టమైన లక్షణాలు లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, దైనందిన జీవన విధానంలో ఒత్తిడి, పొగ త్రాగడం, ఆల్కహాల్ సేవించడం, డయాబెటిస్ కలిగి ఉండడం, బీపీ షుగర్ వంటి వ్యాధులు కలిగి ఉండడం, వంశపారపర్యంగా వ్యాధి కలిగి ఉండడం. కొంతమందికి పుట్టుకతో పాటే గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి. రక్తనాళాలు మూసుకుపోవడం, కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేయడం కారణాలని వైద్యులు చెబుతున్నారు.

గుండెపోటు వచ్చినప్పుడు ఇలా చేయాలి… 

తక్షణమే అత్యవసర సహాయం కోసం కాల్ చేయండి. గుండెపోటును ఆపడానికి తక్షణ వైద్య చికిత్స అవసరం.

మీకు ప్రిస్క్రిప్షన్ ఉంటే, వైద్య సహాయం కోసం వేచి ఉన్నప్పుడు సూచించిన విధంగా నైట్రోగ్లిజరిన్ తీసుకోండి.
వ్యక్తికి పల్స్ లేకపోయినా లేదా శ్వాస తీసుకోకపోయినా, సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడే ఛాన్స్ ఉంటుంది.

అప్రమత్తంగా ఉండాలి… జాగ్రత్తలు తీసుకోవాలి

గుండెపోటును అరికట్టాలంటే ప్రతిరోజు ఉదయం గంట పాటు వాకింగ్, కానీ వ్యాయామం కాని (శారీరక శ్రమ) చేయాలి, 40 సంవత్సరాలు పైబడిన వారు రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి, జంక్ ఫుడ్ ను తీసుకోరాదు, ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ ను అధికంగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ ను తగ్గించాలి, ఆహారంలో మాంస ఉత్పత్తులను తగ్గించాలి, మొలకలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి.
కరోనా వ్యాక్సిన్ గుండెపోటుకు గురవుతున్నారనేది మెడికల్ పరిజ్ఞానం లేని వారి అపోహ మాత్రమే. వ్యాక్సిన్ అనేది సంబంధిత వైరస్ నుండి తయారు చేసేటువంటిది కాబట్టి, వ్యాధి నిరోధానికి మాత్రమే పనిచేస్తుంది కానీ కొత్త రకమైనటువంటి వ్యాధులు ఉద్భవించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అలాంటిదే గనక సంభవించినట్లయితే ఆ రోగికి సంబంధిత వ్యాధులు ముందే గ్రహించకపోవచ్చు, వ్యాక్సినేషన్ అనేది వ్యాధి నిరోధకాన్ని పెంచుతుంది. అంతేకానీ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గుండె సంబంధిత రోగాలు రోగాలు వస్తున్నాయి అనుకోవడం అపోహ మాత్రమే:

Doctor-Swetcha

డాక్టర్ మిట్టపల్లి స్వేచ్ఛ, గుండె వైద్య నిపుణురాలు. 

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!