Travel Date Change: కొన్నికొన్ని సార్లు షెడ్యూల్ ప్రకారం ప్రయాణాలు సాగవు. అకస్మాత్తుగా ఏవో పనులుపడతాయి. లేక, అనారోగ్యమో, ఇంకేవో అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి అనివార్య పరిస్థితుల్లో ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే.. ఇన్నాళ్లూ బుకింగ్ కోసం వెచ్చించిన డబ్బు మొత్తాన్ని రైల్వే ప్రయాణికులు నష్టపోవాల్సి వచ్చేది. అయితే, ఇకపై అలాంటి నష్టమేమీ జరగకుండా, ప్రయాణ తేదీని కూడా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తూ ఇండియన్ రైల్వేస్ సరికొత్త విధానాన్ని (Travel Date Change) అందుబాటులోకి తీసుకొచ్చింది.
కొన్నిసార్లు ప్రయాణ షెడ్యూల్స్ అనూహ్యంగా మారిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు సందిగ్ధంలో పడతారు. ప్రయాణం మానుకుంటే బుకింగ్ డబ్బులు వృథా అవుతాయని చింతిస్తుంటారు. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు భారతీయ రైల్వేలు ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ప్యాసింజర్లు తమ ప్రయాణ తేదీని మార్పుకోవచ్చు. అది కూడా డబ్బు నష్టపోకుండానే ఈ వెసులుబాటుని పొందవచ్చు.
Read Also- Indian Techie: భారతీయ టెకీని ఉద్యోగంలోంచి తీసేసి.. మళ్లీ రమ్మని బతిమాలుతున్న కంపెనీ
జనవరి నుంచి అమల్లోకి!
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. జనవరి నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. కన్మార్ఫ్ అయిన రైలు టికెట్‌ను ఆన్‌లైన్‌లో తేదీ మార్చుకోవచ్చని, ఇందుకోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. ఈ తరహా వ్యవస్థ అన్యాయంగా ఉందని, ప్రయాణికుల ప్రయోజనాలకు విరుద్దంగా ఉందని మంత్రి అశ్వని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. కొత్త విధానం ప్రయాణికులకు ఫ్రెండ్లీగా ఉంటుందని, ఈ విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని ఆయన వివరించారు. అయితే, ప్రయాణ తేదీ మార్చుకున్న తర్వాత కొత్త తేదీకి కన్మార్ఫ్ టికెట్ లభిస్తుందన్న గ్యారంటీ లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. సంబంధిత తేదీల్లో సీటు లభ్యతపై ఆధారపడి ఉంటుందన్నారు. అదేవిధంగా, కొత్త టికెట్ ధర ఎక్కువగా ఉండే, ప్రయాణికులు ఆ వ్యత్యాసాన్ని గుర్తించి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న విధానం ప్రకారం, ప్రయాణ తేదీని మార్చుకోవాలంటే, ముందుగా టికెట్‌ను రద్దు చేసుకొని, కొత్తదాన్ని బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ ప్రక్రియలో టికెట్ రద్దు సమయం ఆధారంగా డబ్బులు కట్ అవుతాయి. తద్వారా ప్రయాణికులకు కొంత ఆర్థిక నష్టం జరుగుతోంద. అదేవిధంగా ప్రయాణికులు అసౌకర్యకరానికి గురవుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన విధానం ఫలితంగా కోట్లాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్యాసింజర్లు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంటే, భారీగా ఫీజులు నష్టపోకుండానే మార్పులు చేసుకోవచ్చు.
Read Also- Mass Jathara: ‘మాస్ జాతర’లో ‘ఓలే ఓలే’ సాంగ్ వివాదంపై స్పందించిన రవితేజ.. శ్రీలీల సపోర్ట్..
టికెట్ రద్దు ప్రస్తుత రూల్స్ ఇవే
ప్రస్తుతం టికెట్ రద్దు రూల్స్ ప్రకారం, 48 నుంచి 12 గంటల మధ్య టికెట్ రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 25 శాతం కట్ అవుతుంది. ప్రయాణ సమయానికి 12 నుంచి 4 గంటల ముందు రద్దు చేసుకుంటే, మరింత ఎక్కువ ఫీజు కట్ అవుతుంది. అదే, రిజర్వేషన్ చార్ట్ తయారు అయిన తర్వాత టికెట్ రద్దు చేస్తే, డబ్బులు తిరిగి రావు. కాబట్టి, ఈ కొత్త విధానం ప్యాసింజర్లకు కొంత ఉపశమనం కలిగించనుంది.
