Techie-News
Viral, లేటెస్ట్ న్యూస్

Indian Techie: భారతీయ టెకీని ఉద్యోగంలోంచి తీసేసి.. మళ్లీ రమ్మని బతిమాలుతున్న కంపెనీ

Indian Techie: కొంతమంది బాస్‌ల అనుచిత ప్రవర్తన కారణంగా కిందిస్థాయి ఉద్యోగులుఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఓ భారతీయ టెకీకి (Indian Techie) అలాంటి పరిస్థితే ఎదురైంది. బాస్ టార్గెట్ చేసి మరీ ఉద్యోగంలోంచి వెళ్లగొట్టాడు. కంపెనీ నుంచి తీసేశారు. అయితే, తప్పు తెలుసుకున్న కంపెనీ.. తిరిగి ఉద్యోగంలోకి రావాలంటూ ఇండియన్ టెకీని బతిమాలుతోంది. భారత్‌కు చెందిన ఓ టెకీ తనకు ఎదురైన అనుభవాన్ని రెడిట్ వేదికగా షేర్ చేసి, ఒక సలహా ఇవ్వాలని కోరాడు. ‘‘భారీ జీతం వస్తున్న ఉద్యోగంలోంచి నన్ను తొలగించారు. ఇప్పుడు వాళ్లంతట వాళ్లే నన్ను తిరిగి రమ్మని కోరుతున్నారు’ అనే టైటిల్‌తో పోస్టు పెట్టాడు.

తొలుత ఒక ఇండియన్ ఎంఎన్‌సీలో సౌకర్యవంతంగా పనిచేస్తూ రూ.30 లక్షల వార్షిక వేతనం తీసుకునేవాడినని, అయితే, ఓ విదేశీ కంపెనీలో ‘ఇండివిడువల్ కాంట్రాక్టర్’గా (Individual Contractor) ఉద్యోగం వచ్చిన తర్వాత తన కష్టాలు మొదలయ్యాయని వివరించాడు. తనది కష్టపడి పనిచేసే తత్వమని, తాను ప్రతిరోజూ 10 గంటల పాటు పని చేయడం, వీకెండ్స్ కూడా పనిచేయడం వంటివి మేనేజర్‌ను తొలి రోజుల్లో బాగా ఆకట్టుకున్నాయి. ‘‘మొదటిసారి విదేశాల్లో ఉన్న కంపెనీ ఆఫీస్‌ను సందర్శించినప్పుడు నా పనిని కంపెనీ మేనేజర్ ప్రశంసించారు. ఆయన కూడా భారతీయుడే. నన్ను టాప్ మేనేజ్‌మెంట్‌కు పరిచయం చేశాడు. తర్వాత 10 శాతం ఇంక్రిమెంట్‌తో కాంట్రాక్ట్‌ రెన్యూవల్ కూడా అయింది. కానీ, మా ఇద్దరి మధ్య సఖ్యత విషయంలో ఇదే అత్యున్నత స్థాయి దశ. ఆ తర్వాత మేనేజర్ నాపై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. చిన్న తప్పులను పెద్దవిగా చూపించడం, కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే విమర్శించడం చేస్తూ వచ్చాడు. పొద్దాక నా జీతం ఎక్కువ అని అంటుండేవాడు’’ అని బాధిత టెకీ గుర్తుచేసుకున్నాడు.

Read Also- Physics Nobel: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ అవార్డ్.. 1985లో ప్రయోగం.. నేడు విప్లవాత్మక మార్పులు

‘‘ఆ తర్వాత క్రమంగా, ఓవర్‌టైమ్ పేమెంట్ తీసేశారు. సెలవులు ఇవ్వలేదు. ప్రతిరోజూ అరగంటకోసారి అప్‌డేట్ అడగడం మొదలుపెట్టాడు. ఒక టెకీగా పని చేయడం నాకు ఇష్టం. జీతం కూడా బాగుంది. కానీ మూడేళ్ల మానసిక వేదన తర్వాత, నేను నిబంధనలు ఉల్లంఘించి, దుర్వినియోగానికి పాల్పడినట్టు ఒక మీటింగ్‌లో టాప్ మేనేజ్‌మెంట్ ముందు మేనేజర్‌ ఆధారాలు చూపించాడు. కొన్ని వారాలు అటుఇటు ఊగిసలాడి, చివరకు ఆగస్టు నెలలో నాన్-పర్ఫార్మెన్స్ అనే కారణాన్ని చూపి టెర్మినేషన్ మెయిల్ పంపించారు. అయినప్పటికీ నోటీస్ పీరియడ్‌ను పూర్తిగా ప్రొఫెషనల్‌గా ముగించాను. మధ్యలో మెరుగైన పనితీరును మెచ్చకుంటూ ప్రశంసా మెయిల్ కూడా వచ్చింది’’ అని టెకీ వివరించారు. ఎంత ప్రశంసించినా, ఈ వ్యవహారమంతా తనపై మానసిక స్థితిపై ప్రభావం చూపిందని, రెండు నెలలు విరామం తీసుకున్నానని వివరించాడు.

హఠాత్తుగా కంపెనీ నుంచి మెయిల్..

రెండు నెలల బ్రేక్ తర్వాత, కొత్త జీవితానికి సిద్ధమవుతున్న సమయంలో, హఠాత్తుగా సదరు కంపెనీ హెచ్చార్ నుంచి మెయిల్ వచ్చిందని, తిరిగి ఉద్యోగంలో చేరగలరా? అని అడిగారని టెకీ వివరించాడు. ఓ సీనియర్ మేనేజర్ కూడా తనతో మాట్లాడాడని, తిరిగి వస్తే వాతావరణం మారిపోతుందంటూ హెచ్చార్ వాళ్లు కూడా హామీ ఇస్తున్నారని, ఈ విషయంలో తనకు సలహా ఇవ్వాలని రెడిట్ యూజర్లను సదరు టెకీ కోరాడు.

Read Also- LIC Jeevan Umang Scheme: రూ.1300 పెట్టుబడితో.. లైఫ్ లాంగ్ రూ.40,000 పెన్షన్.. ఎల్ఐసీలో సూపర్ డూపర్ స్కీమ్!

నెటిజన్ల స్పందనలు ఇవే..

సదరు టెకీ పోస్ట్ వైరల్ కావడంతో చాలా మంది అతడికి సూచనలు చేశారు. ‘‘బ్యాక్‌అప్ ప్లాన్ రెడీ చేసుకో. కనీసం 6 నెలల ఇాలరీ సెక్యూరిటీగా అడుగు’’ అని ఒకరు, ‘‘ఒకే, తిరిగి వెళ్లవచ్చు. కానీ మళ్లీ అదే మేనేజర్‌కి రిపోర్ట్ చేయవద్దు. ఇది ముందుగా క్లియర్ ‌చేసుకో” అని ఇంకొరు, ‘‘తిరిగి జాయిన్ కావచ్చు. కానీ ఆ మేనేజర్‌ ఇకపై మీ బాస్‌గా ఉండకూడదని స్పష్టంగా చెప్పండి. అలాగే 6 నెలల సీవరెన్స్ (పూర్తి జీతం) ఒప్పందంలో ఉండాలి’’ అని ఇంకొకరు సూచించారు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది