Nobel-Prize
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Physics Nobel: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ అవార్డ్.. 1985లో ప్రయోగం.. నేడు విప్లవాత్మక మార్పులు

Physics Nobel: అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు జాన్ క్లార్క్, మిచెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్‌‌కు భౌతిక శాస్త్ర విభాగంలో (Physics Nobel) నోబెల్ పురస్కారం-2025 దక్కింది.  ‘ ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో స్థూలస్థాయిలో క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్‌ను గుర్తించినందుకు’ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్ అవార్డ్ ఎంపిక కమిటీ తెలిపింది. 1985లో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన, నేడు అధునాతన టెక్నాలజీలుగా పరిగణిస్తున్న క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కంప్యూటర్లు, క్వాంటమ్ సెన్సార్ల వంటి తదుపరి తరం క్వాంటమ్ సాంకేతికత అభివృద్ధికి బాటలు వేసిందని కొనియాడింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు అమెరికాలోనే ఉంటున్నారు.

శాస్త్రవేత్తలు ఏం సాధించారు?

క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ అంటే, సాధారణంగా ఏదైనా ఒక అడ్డంకి (గోడ) ఉంటే దానిని దాటి వెళ్లాలంటే శక్తి (energy) అవసరం అవుతుంది. కానీ, క్వాంటమ్ స్థాయిలో (అంటే చిన్న పరమాణు లేదా ఎలక్ట్రాన్ స్థాయిలో) ఒక చిన్న కణం (particle) వద్ద శక్తి లేకపోయినా కూడా అది అడ్డంకిని చొచ్చుకొని బయటకు వెళ్లగలుగుతుంది. చిన్నచిన్న పదార్థాల రూపంలో ఇది సాధ్యపడుతుంది. దీనినే ‘టన్నెలింగ్’ అని పిలుస్తారు. ఇది భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా కనిస్తుంది. కానీ, క్వాంటమ్ శాస్త్రంలో సాధ్యపడుతుంది.

ఇక, మాక్రోస్కోపిక్ క్వాంటమ్ టన్నెలింగ్ అంటే, కళ్లతో చూడగలిగేంత స్థాయిలో, లేదా పెద్ద సిస్టమ్‌లో క్వాంటమ్ టన్నెలింగ్ జరిగే ప్రక్రియ. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు టన్నెలింగ్ ప్రవర్తనను చిన్న చిన్న కణాల్లో కాకుండా, ఒక ‘ఎలక్ట్రిక్ సర్క్యూట్’లో చేపట్టి క్వాంటర్ ప్రవర్తనలను నిరూపించారు. మామూలు పరికరాల్లో కూడా క్వాంటమ్ టన్నెలింగ్ ఏవిధంగా పనిచేస్తుందో చూపించారు. మొత్తంగా చెప్పాలంటే, కేవలం అణువులు, ఎలక్ట్రాన్ల స్థాయిలో మాత్రమే క్వాంటమ్ ప్రవర్తనలు ఉంటాయని నాడు అందరూ భావించగా.. పెద్ద సర్క్యూట్లలో కూడా జరుగుతాయని జాన్ క్లార్క్, మిచెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్‌ తమ ప్రయోగాల ద్వారా నిరూపించారు. ఇది చాలా గొప్ప విషయం.

Read Also- VC Sajjanar: కొంతమంది అలా డ్రైవింగ్ చేస్తున్నారు.. ఊరుకోబోం.. హైదరాబాదీలకు సజ్జనార్ వార్నింగ్

ఎంత డబ్బు ఇస్తారు?

నోబెల్ భౌతిక శాస్త్ర అవార్డును స్వీడన్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందజేస్తుంది. పురస్కారం కింద మొత్తం 1.1 కోట్ల స్వీడిష్ క్రౌన్లు బహుకరిస్తుంది. భారతీయ కరెన్సీలో ఈ విలువ రూ.10.65 కోట్ల పైమాటే. ఈ మొత్తాన్ని ముగ్గురు గ్రహీతలకు సమానంగా పంచుతారు. కాగా, నోబెల్ అవార్డులు డైనమైట్ ఆవిష్కర్త అల్‌ఫ్రెడ్ నోబెల్ పేరిట ఇస్తున్నారు. 1901 నుంచి ఈ అవార్డులు కొనసాగుతున్నాయి. మొదటి, రెండవ ప్రపంచ యుద్ద సమయాల్లో మినహా ప్రతీ ఏడాది సైన్స్, సాహిత్యం, శాంతి విభాగాల్లో అవార్డులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఆర్థికశాస్త్ర విభాగంలో కూడా పురస్కారాన్ని మొదలుపెట్టారు.

ఇక, భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న శాస్త్రవేత్తల జాబితాలో గొప్పగొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్, పియర్, మేరీ క్యూరీ, మ్యాక్స్ ప్లాంక్, నీల్స్ బోర్ లాంటి అత్యంత ప్రభావవంత వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. గతేడాది అమెరికన్ శాస్త్రవేత్త జాన్ హాప్ఫీల్డ్, బ్రిటీష్-కెనడియన్ జెఫ్రే హింటన్ భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డు గెలుచుకున్నారు. మెషీన్ లెర్నింగ్‌లో చేసిన మార్గదర్శక పరిశోధనలకుగానూ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారు చేసిన పరిశోధనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు మార్గంచూపింది.

Read Also- Rinku Gifts Sister: లక్ష రూపాయలతో చెల్లికి విలువైన బహుమతి కొనిచ్చిన రింకూ సింగ్.. ఏం ఇచ్చాడంటే?

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?