Rinku-Singh
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Rinku Gifts Sister: లక్ష రూపాయలతో చెల్లికి విలువైన బహుమతి కొనిచ్చిన రింకూ సింగ్.. ఏం ఇచ్చాడంటే?

Rinku Gifts Sister: టీమిండియా టీ20 ప్లేయర్ రింకూ సింగ్‌కు ఆసియా కప్-2025లో ఆడే అవకాశం దాదాపుగా రాలేదని చెప్పాలి. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కినా కేవలం ఒకే ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఆ ఒక్క బంతి కూడా చిరస్మణీయంగా గుర్తుండిపోయేలా రింకూ సింగ్ ఆడాడు. పాక్‌పై గెలుపునకు ఒక్క పరుగు అవసరమైన స్థితిలో క్రీజులోకి వెళ్లిన రింకూ సింగ్ అద్భుతమైన ఫోర్ బాదాడు. దీంతో, భారత జట్టు దాయాది పాకిస్థాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్ని దక్కించుకుంది. ఒకే బంతి ఆడినప్పటికీ విన్నింగ్ షాట్ కావడంతో రింకూ సింగ్‌పై ప్రశంసల జల్లు కురిసింది. క్రికెట్ విషయాన్ని పక్కనపెడితే, తాజాగా మరోసారి రింకూ సింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. తన చెల్లెలు నేహాకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా (Rinku Gifts Sister) కొనివ్వడమే ఇందుకు కారణంగా ఉంది.

ఆసియా కప్ ముగియడంతో కొన్ని రోజులుగా స్వదేశంలోనే ఉన్న రింకూ సింగ్, కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో తన చెల్లెలు నేహాకు సుమారు ఒక లక్ష రూపాయల విలువైన రెడ్ కలర్ విడా వీఎక్స్2 ప్లస్ (Vida VX2 Plus) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గిఫ్ట్‌గా కొనిచ్చాడు.

Read Also- Crime News: వివాహేతర సంబంధం అనుమానంతో.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త.. ఎక్కడంటే?

థ్యాంక్యూ భయ్యా..

అన్నయ్య రింకూ సింగ్ కొనిచ్చిన బహుమతిని నేహా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. స్కూటీ కొనిచ్చిన సందర్భంలో అన్నయ్య రింకూ సింగ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసివున్న ఫొటోలను నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘థ్యాంక్యూ రింకూ భయ్యా’ అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది. కాగా, రింకూ సింగ్ 2024 నవంబర్‌లో అలీగఢ్‌లో దాదాపు రూ.3.5 కోట్లతో ఒక మూడంతస్తుల లగ్జరీ బంగ్లాను కొన్నాడు. తన అమ్మ పేరు మీదగా ‘వీనా ప్యాలెస్’ అని పేరు పెట్టుకున్నాడు.

Read Also- Indiramma Atmiya Bharosa: భూమిలేని రైతులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం!

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, టోర్నమెంట్‌ను భారత్ గెలవాలని, విన్నింగ్ షాట్ తానే కొట్టాలని ప్రారంభానికి ముందే అనుకున్నాడట. ఆసియా కప్ ప్రసార హక్కులు దక్కించుకున్న మీడియా సంస్థతో ప్రారంభానికి ముందే ఈ మాట చెప్పాడు. అనూహ్యంగా అంతా రింకూ సింగ్ కోరుకున్నట్టుగానే జరిగింది. ఆ టోర్నమెంట్ మొత్తం ఒక్క బంతి మాత్రమే ఆడాడు. అది కూడా ఫైనల్ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ కావడం గమనార్హం. ఆ ఒక్క బంతిని మిడ్-ఆన్ మీదుగా బౌండరీకి తరలించి, భారత్‌కు 9వ ఆసియా కప్ టైటిల్‌ను అందించినట్టు అయ్యింది. మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మాట్లాడుతూ, ‘‘ఇంకేమీ ముఖ్యం కాదు. ఆ ఒక్క బంతే ముఖ్యం. ఒక్క పరుగే కావాలి. నేను నాలుగు కొట్టాను. అందరికీ తెలుసు, నేనొక ఫినిషర్‌ని. జట్టు గెలిచింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

">

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది