Gill – Rohit Sharma: ఆస్ట్రేలియాతో వన్డే, టీ20లు ఆడే భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. అయితే వన్డేలకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. శుభ్ మన్ గిల్ కు సారథ్య బాధ్యతలను అప్పగించింది. అయితే కేవలం బ్యాటర్ గానే రోహిత్ శర్మకు అవకాశం కల్పించడం గమనార్హం. దీంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ జైత్రయాత్రకు ఆస్ట్రేలియా వడ్డే సిరీస్ తో ముగింపు పడనుంది. మరోవైపు తాజాగా ప్రకటించిన వన్డే జట్టులో విరాట్ కోహ్లీ (Virat Kohli) సైతం ఉండటంతో మరోమారు మైదానంలో రో-కో (Ro-Ko)ను చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
వన్డే జట్టు ఇదే..
ఆస్ట్రేలియా పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం భారత జట్లను శనివారం సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే సిరీస్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరికీ స్థానం కల్పించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వన్డేలకు గిల్ ను కెప్టెన్ కు ఎంపిక చేసిన సెలక్టర్లు.. వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ కు అవకాశం కల్పించారు. కాగా, అక్టోబర్ 19న తొలి వన్డే ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న రెండో వన్డే, 25వ తేదీన మూడో వన్డే జరగనుంది. వన్డేలకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు ఇలా ఉంది.
వన్డే జట్టు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్(వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ద్రువ్ జురేల్, యశస్వి జైశ్వాల్.
🚨 India’s squad for Tour of Australia announced
Shubman Gill named #TeamIndia Captain for ODIs
The #AUSvIND bilateral series comprises three ODIs and five T20Is against Australia in October-November pic.twitter.com/l3I2LA1dBJ
— BCCI (@BCCI) October 4, 2025
టీ20 జట్టు ఇదే..
మరోవైపు ఆస్ట్రేలియాతో ఐదు టీ20లు ఆడబోయే జట్టును సైతం బీసీసీఐ ప్రకటించింది. అయితే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కే అవకాశమిచ్చింది. గిల్.. వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. అక్టోబర్ 29న ఆసీస్ తో తొలి టీ-20 మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 31న రెండో టీ20, నవంబర్ 2న మూడో టీ20, 6వ తేదీన నాలుగో టీ20, 8వ తేదీన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా, బీసీసీఐ ప్రకటించిన టీ20 జట్టు ఇలా ఉంది.
ట్వీ20 జట్టు : సూర్య కుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బూమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.
Also Read: India’s Top Billionaires: దేశంలోనే అపరకుబేరులు.. వారు ఏం చదివారో తెలిస్తే.. తప్పక షాకవుతారు!
చాలా రోజుల తర్వాత..
ఇదిలా ఉంటే రోహిత్, విరాట్ కోహ్లీని క్రికెట్ మైదానంలో చూసి చాలా రోజులైంది. మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్స్ తర్వాత వారు టీమిండియా జెర్సీలో అస్సలు కనిపించలేదు. ఐపీఎల్ లో వేర్వేరు జట్లకు (ఆర్సీబీ, ముంబయి) జట్లకు ఆడినప్పటికీ దేశం తరుపున వారు ఆడుతున్నప్పుడు ఉండే ఎమోషన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పటికే టెస్టులు, టీ20లకు రో-కో రిటైర్మెంట్ ప్రకటించడంతో వారిని మైదానంలో చూసేందుకు ఉన్న ఏకైక అవకాశం వన్డేలు మాత్రమే. అయితే తాజాగా వన్డే జట్టులో ఇరువురికి చోటు లభించడం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
