India’s Top Billionaires: ఈ రోజుల్లో డబ్బుకు ఉన్న విలువ అంతా ఇంత కాదు. డబ్బున్నోడిదే రాజ్యం అన్నట్లుగా సొసైటీ మారిపోయింది. అందుకే ప్రతీ ఒక్కరు డబ్బుకు లోటు లేకుండా దర్జాగా బతకాలని కోరుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డలకు ఉన్నత చదువులు చదివించడం ద్వారా.. వారి భవిష్యత్తుకు ఏ లోటు ఉండకూడదని భావిస్తుంటారు. మరి చదువు నిజంగానే మనుషుల తలరాతను మారుస్తుందా? వ్యక్తుల జీవితాల్లో కనక వర్షం కురిపిస్తుందా? ఇంతకీ దేశంలోని అపరకుబేరులు ఏం చదువుకున్నారు? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అందరూ చదువుకున్నావారే!
ప్రస్తుతం దేశంలో అత్యంత ధనికులు అనగానే ముందుగా అందరికీ రియలన్స్ అధినేత ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీనే గుర్తుకు వస్తారు. వారితో పాటు సావిత్రి జిందాల్, శివ నాదల్ వంటి కుబేరులు సైతం అత్యధిక ఆస్తులతో కుబేరులుగా దేశంలో ఉన్నారు. ఇదిలా ఉంటే దేశంలో టాప్ – 10 కోటీశ్వరుల్లో చాలా మంది స్టీల్, ఔషధాలు, టెలికాం, వ్యాక్సిన్ లు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, విభిన్న రంగాల్లో వ్యాపార ద్వారా సంపాదన కూడగడుతున్నారు. ఇందుకు వారు చదువుకున్న విద్య, సంపాదించిన జ్ఞానం కూడా దోహదం చేస్తోంది.
1. ముఖేష్ అంబానీ (Mukesh Ambani)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ అక్టోబర్ 4, 2025 నాటికి 119.5 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.9.5 లక్షల కోట్లకు సమానం. ఇక అంబానీ విద్యార్హత విషయానికి వస్తే.. ఆయన ముంబయి విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. కెమికల్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చేశారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ (అమెరికా)లో MBA పట్టా సైతం అందుకున్నారు.
2. గౌతమ్ అదానీ (Gautam Adani)
భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. 1970ల చివరలో ఆయన ముంబైలోని ఒక కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించారు. కానీ తిరస్కరించబడ్డారు. ఆ తర్వాత చదువును కొనసాగించకుండా వ్యాపారంలో అడుగుపెట్టారు. ఇవాళ 97 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. అతడి ఆస్తుల విలువ దాదాపు రూ.8.15 లక్షల కోట్లు.
3. సావిత్రి జిందాల్ (Savitri Jindal)
జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఓం ప్రకాశ్ జిందాల్ భార్య సావిత్రి జిందాల్ ప్రస్తుతం చైర్‌పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాపార సంస్థ స్టీల్, విద్యుత్, సిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025 అక్టోబర్ 4 నాటికి ఆమె ఆస్తి విలువ 40 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే దాదాపు రూ.3.2 లక్షల కోట్ల ఆస్తులను ఆమె కలిగి ఉన్నారు. ఆమె ఉన్నత చదువులు చదివినట్లు సన్నిహితులు తెలియజేశారు.
4. శివ్ నాదార్ (Shiv Nadar)
హెచ్ సీఎల్ (HCL) గ్రూప్ వ్యవస్థాపకుడిగా ఉన్న శివ్ నాదార్ నికర ఆస్తి 31.6 బిలియన్ డాలర్లు. ఆయన తమిళనాడు కుంబకోణంలోని టౌన్ హైయర్ సెకండరీ స్కూల్ (Town Higher Secondary School)లో విద్యనభ్యసించారు, తరువాత మదురైలోని ది అమెరికా కాలేజ్ (The American College)లో ప్రీ-యూనివర్సిటీ పూర్తి చేశారు. అనంతరం కోయంబత్తూరులోని పీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ (PSG College of Technology) నుండి ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్రింగ్ లో డిగ్రీ పొందారు. ఆయన తన కెరీర్‌ను వాల్ చంద్ (Walchand) సంస్థలో ప్రారంభించారు.
Also Read: Jio Prepaid Plans: జియో స్పెషల్ ఆఫర్.. రూ.189కే 5జీ డేటా, అపరిమిత కాల్స్.. ఆపై లైవ్ ఛానల్స్, టీవీ షోస్!
5. దిలీప్ షాంగ్వి (Dilip Shanghvi)
సన్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ (Sun Pharmaceutical Industries) మేనేజింగ్ డైరెక్టర్ గా దిలీప్ షాంగ్వి కొనసాగుతున్నారు. ఇది దేశంలో అత్యంత విలువైన ఔషధ కంపెనీలలో ఒకటి. షాంగ్వి.. సన్ ఫార్మా అండ్వాన్స్ డ్ రీసెర్చ్ కంపెనీ (Sun Pharma Advanced Research Company)కి సైతం నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఆయన అజ్మేరా హైస్కూల్లో చదివారు. తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని భవనీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
