Dhruv-Jurel
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Jurel Army Salute: టెస్ట్ కెరీర్‌లో జురెల్ తొలి సెంచరీ.. సెల్యూట్ చేస్తూ ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా?

Jurel Army Salute: అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు కదంతొక్కారు. సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా శతకాలు సాధించారు. ముఖ్యంగా, ధ్రువ్ జురెల్‌ టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీ అందుకున్నాడు. దీంతో, తన మొదటి సెంచరీని భారత ఆర్మీకి (Jurel Army Salute) అంకితం చేశాడు. ఇందుకోసం శతకం పూర్తయిన తర్వాత స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆర్మీ స్టైల్ సెల్యూట్ చేయడం ద్వారా తన సందేశాన్ని ఇచ్చాడు. జురెల్ సాధించిన ఈ సెంచరీ ఇండియన్ ఆర్మీతో పాటు తన తండ్రి, కర్గిల్ యుద్ధ వీరుడైన నేమ్ చంద్‌కు కూడా  అంకితం ఇచ్చినట్టు అయింది. నెమ్ చంద్ భారత సైన్యంలో పని చేశారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలలో జురేల్ మాట్లాడుతూ, తన తండ్రి దేశానికి చేసిన సేవకు గౌరవంగా మైదానంలో సెల్యూట్ చేయడం తన తరఫున ఇచ్చే చిన్న గౌరవమని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో అర్ధశతకం పూర్తిచేసుకున్నప్పుడు కూడా జురెల్ ఇదే స్టైల్‌‌లో సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.

Read Also- SBI Card Alert: ఎస్‌బీఐ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త ఫీజు

అందుకే ఈ సెలబ్రేషన్

అహ్మదాబాద్ టెస్టులో శతకం సాధించడంపై ధ్రువ్ జురేల్ రెండవ రోజు ఆట ముగిసిన తర్వాత మాట్లాడాడు. ‘‘ అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత మా నాన్నకు అంకితం చేస్తూ సెల్యూట్ చేశాను. అయితే, శతకం కోసం చానాళ్లుగా ఒక ప్రత్యేకమైన సెలబ్రేషన్‌ను నా మనసులో ఉంచుకున్నాను. ఎందుకంటే, భారత సైన్యానికి నేను చాలా దగ్గరగా ఉన్నాను. నా చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరిగాను. గ్రౌండ్‌లో మేము చేసేవి, యుద్ధభూమిలో వాళ్లు సాధించేవి చాలా విభిన్న అంశాలు. వాటిని అస్సలు పోల్చలేను. ఆర్మీ పట్ల నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. భవిష్యత్తులో నేను చేసే ప్రతిదీ వాళ్ల కోసమే అయ్యి ఉంటుంది. ఈ సెంచరీని నేను భారత సైన్యానికి అంకితం చేస్తున్నాను. వాళ్లు చేసే సేవ చాలా గొప్పది. నేను దాన్ని దగ్గర నుంచి చూశాను. నాన్నను ఎన్నో విషయాలు అడుగుతుండేవాడిని. నిజంగా వాళ్లు దీనికి అర్హులు’’ అని జురెల్ వివరించాడు.

Read Also- Chaitanya Rao: ‘ఘాటి’ విలన్ హీరోగా.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చిత్రం! క్లాప్ కొట్టిందెవరంటే?

అహ్మదాబాద్ టెస్టులో పట్టు

అహ్మదాబాద్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పట్టుసాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌట్ అవ్వగా, రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు సాధించింది. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 286 పరుగులుగా ఉంది. రెండవ రోజు ఆటలో రవీంద్ర జడే, ధ్రువ్ జురెల్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా, మిగతా బ్యాటర్ల స్కోర్ల విషయానికి వస్తే, కేఎల్ రాహుల్ 100, ధ్రువ్ జురేల్ 125, రవీంద్ర జడేజా 104 (బ్యాటింగ్) చొప్పున సెంచరీలు సాధించారు. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 50, యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7, వాషింగ్టన్ సుందర్ 7 (బ్యాటింగ్) చొప్పున పరుగులు సాధించారు. వెస్టిండీస్ బౌలర్లలో కెప్టెన్ రోస్టోన్ చేస్ 2 వికెట్లు, జాయ్‌డెన్ సీల్స్, జొమెల్ వర్రికాన్, ఖారీ ఫీర్రె తలో వికెట్ తీశఆడు. తొలి టెస్టును సొంతం చేసుకొని వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకోవాలని టీమిండియా భావిస్తోంది.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?