Upendra-Dwivedi
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Operation Sindoor 2.O: మ్యాప్‌లో లేకుండా చేస్తాం.. పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ ‘డెడ్లీ వార్నింగ్’

Operation Sindoor 2.O: ఉగ్రమూకలకు ఊతం ఇస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌ను భారత్ మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఇకపైనా ఆపాలని, లేదంటే పాకిస్థాన్‌కు భౌగోళిక స్వరూపం లేకుండా చేస్తామని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని పాక్ ప్రభుత్వం తక్షణమే ఆపివేయాలని, లేదంటే, ఈ భూలోకంపై ఉనికిని కోల్పోయేలా చేస్తామని అన్నారు. రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్ ప్రాంతంలో ఓ సైనిక పోస్టు వద్ద సైనికులతో మాట్లాడుతూ జనరల్ ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదం విషయంలో భారత సైన్యం ఈసారి ఏమాత్రం సహనం చూపించబోదని, ‘ఆపరేషన్ సిందూర్ 1.0’ సమయంలో అనుసరించిన నిబంధనలను ఈసారి పాటించబోమని ఆయన గర్జించారు. పాకిస్థాన్ మార్పులేకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ (Operation Sindoor 2.O) త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. తాము తీసుకోబోయే ఒక చర్యకు భూమిపై ఉంటుందా?, లేదా? అని పాకిస్థాన్ ఆలోచించేలా చేస్తామని ఉపేంద్ర ద్వివేది ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సైనికులంతా సిద్ధంగా ఉండాలని ద్వివేది సూచించారు. ‘‘దైవానుగ్రహం ఉంటే, మళ్లీ మీకు అవకాశం వస్తుంది. ఆల్ ది బెస్ట్’’ అని ఆయన పేర్కొన్నారు.

Read Also- Blackmail by Husband: భార్య వీడియోలు తీసి.. భర్త చేస్తున్న వికృత చేష్ట ఇదీ

ఎయిర్‌‌ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ. సింగ్ కూడా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెలలో ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన కీలక విషయాలను శుక్రవారం బయటపెట్టారు. పాకిస్థాన్‌కు చెందిన 8 నుంచి 10 వరకు ఫైటర్ జెట్లను భారతీయ వాయు దళం కూల్చివేసిందని ఆయన వెల్లడించారు. కూల్చివేసిన యుద్ధ విమానాల జాబితాలో అమెరికా తయారు చేసిన ఎఫ్-16లు, చైనాలో తయారైన జేఎఫ్-17లు ఉన్నాయని ఏపీ సింగ్ పేర్కొన్నారు. సుమారు 300 కిలోమీటర్ల దూరం నుంచి కూడా పాక్‌కు చెందిన ఒక ఏఈడబ్ల్యూసీ విమానంపై దీర్ఘశ్రేణి క్షిపణి దాడి జరిపామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇండియన్ ఆర్మీ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. 4 నుంచి 5 వరకు యుద్ధవిమానాలు (ఎఫ్-16లు, లేదా జేఎఫ్-17లు) కూలిపోయినట్టుగా భారత వాయుసేన వద్ద సమాచారం ఉందని ఏపీ సింగ్ వివరించారు. భారత క్షిపణి దాడులతో పాకిస్థాన్ మిలటరీకి చెందిన రాడార్ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్‌వేలు, హ్యాంగర్లు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఏపీ సింగ్ వివరించారు. అమెరికా తయారు చేసిన మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానం ‘సీ-130’ తరహా విమానం కూడా ఒకటి కూలిపోయి ఉండొచ్చని, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరమని ఉందని ఏపీ సింగ్ చెప్పారు.

Read Also- SBI Card Alert: ఎస్‌బీఐ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త ఫీజు

పాకిస్థాన్‌కు జరిగిన నష్టాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, అనేక ఎయిర్‌ఫీల్డ్స్, మిలటరీ వసతుల లక్ష్యంగా దాడులు చేశామని ఏపీ సింగ్ చెప్పారు. నాలుగు చోట్ల రాడార్లు, రెండు చోట్ల కమాండ్ సెంటర్లు, రెండు రన్‌వేలు ధ్వంసమయ్యాయని, తీవ్ర నష్టం జరిగిందని వివరించారు. మూడు వేర్వేరు ఎయిర్‌బేస్‌లలో హ్యాంగార్లు దెబ్బతిన్నాయని, ఇందుకు సంబంధించిన వివరాలు బయటపెట్టారు. ‘‘ ఒకటి ఉపరితలం నుంచి గగనతల క్షిపణి వ్యవస్థను కూడా ధ్వంసం చేశాం. 300 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాన్ని చేధించాం’’ అని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియా సమావేశంలో ఏపీ సింగ్ మాట్లాడారు.

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..