SBI Card Alert: ఎస్‌బీఐ కార్డ్ యూజర్లకు కీలక అప్‌డేట్ (SBI Card Alert) వచ్చింది. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా విద్య (Education) సంబంధ పేమెంట్లు చేస్తే, అలాంటి లావాదేవీలపై 1 శాతం ఛార్జ్ విధిస్తామని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన 2025 నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ రూ.1,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులు చేస్తే అదనంగా మరో 1 శాతం ఛార్జ్ పడుతుందని స్పష్టం చేసింది. అయితే, స్కూల్, లేదా కాలేజీల ఫీజులు తమ అధికారిక వెబ్‌సైట్, లేదా పీవోఎస్ మెషీన్ ద్వారా నేరుగా చెల్లింపులు చేసి ఛార్జీల నుంచి మినహాయింపు పొందవచ్చని ఎస్‌బీఐ కార్డ్ వివరించింది. ఈ కొత్త నిబంధనకు సంబంధించిన పూర్తి వివరాలను ‘ఎస్‌బీఐ కార్డ్’ అధికారి వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది. కాగా, ఎస్‌బీఐ కార్డును ఉపయోగించి విద్య సంబంధ చెల్లింపులు కోసం ఉపయోగిస్తున్న థర్డ్ పార్టీ యాప్‌ల జాబితాలో క్రెడ్, చెక్, మొబిక్విక్ (MobiKwik) వంటి ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి.
మరో కీలక సమాచారం విషయానికి వస్తే, 2025 సెప్టెంబర్ 16 నుంచి రెన్యూవల్ తేదీల ఆధారంగా సీపీపీ (the Card Protection Plan) కస్టమర్లను ఆటోమేటిక్‌గా కొత్త ప్లాన్ వేరియంట్లలోకి మార్చామని ఎస్బీఐ కార్డ్ ధృవీకరించింది. అప్‌డేట్ చేసిన కొత్త ప్లాన్ల ఫీచర్లు, కొత్త ధరలకు సంబంధించిన సమాచారం ఎస్‌బీఐ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది.
Read Also- Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!
అజియో, జియోమార్ట్‌లో షాపింగ్ చేస్తే రివార్డులే రివార్డులు
ఎస్‌బీఐ కార్డ్ వినియోగదారులకు ఇటీవలే ఒక గుడ్‌న్యూస్ కూడా వచ్చింది. అజియో (Ajio), జియోమార్ట్ (JioMart) వెబ్‌సైట్‌లలో ఎస్‌బీఐ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్ షాపింగ్ చేసి భారీగా రివార్డ్ పాయింట్లు పొందవచ్చని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఎస్‌బీఐ కార్డ్ వినియోగదారులు, రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ (Reliance SBI Card PRIME) కార్డులు ఉపయోగిస్తున్నవారు ప్రతి రూ.100 ఖర్చుపై 20 రివార్డ్ పాయింట్లు పొందుతారని వివరించింది. ఇతర ఎస్‌బీఐ కార్డుల వినియోగదారులు ప్రతి రూ.100 ఖర్చుపై 10 పాయింట్లు పొందుతారని తెలిపింది. ఈ ప్రయోజనాలు కేవలం అజియో, జియోమార్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనుగోళ్లు జరిపినవారికి మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. అయితే, కొన్ని నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, గతంలో రిలయన్స్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అజియో, జియోమార్ట్ వంటి ప్లాట్‌ఫామ్స్‌పై ప్రతి రూ.100 వ్యయంపై 5 రివార్డ్ పాయింట్లు మాత్రమే లభించేవి. 2025 అక్టోబర్ 1 నుంచి 10 పాయింట్లు రానున్నాయి. రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ కార్ వినియోగదారులకు ఇదివరకు ప్రతి రూ.100 ఖర్చుపై 10 పాయింట్లు మాత్రమే లభించేవి, ఇప్పుడు రెట్టింపు అయ్యి 20 రివార్డ్ పాయింట్లకు పెరిగాయి.
Read Also- Jharkhand: పట్టించుకోని ప్రభుత్వం.. సొంత నిధులతో రోడ్డేసిన మహిళలు.. రియల్లీ గ్రేట్!
