Mitra Mandali: ‘మిత్ర మండలి’ సినిమా కామెడీకి కేరాఫ్ అడ్రస్..
mitramandali( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mitra Mandali: ‘మిత్ర మండలి’ సినిమా కామెడీకి కేరాఫ్ అడ్రస్.. దానికి మించి..

Mitra Mandali: ఏ జోనర్ అయినా కామెడీ అలరించే సినిమాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తాజాగా అదే జోనర్ లో తెలుగులో ‘మిత్ర మండలి’ అనే సినిమా రాబోతుంది. బివి వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్‌లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ‘మిత్ర మండలి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. టీజర్‌, ‘కత్తందుకో జానకి’, ‘జంబర్ గింబర్ లాలా’ వంటి పాటలతో ‘మిత్ర మండలి’పై బజ్ నెలకొంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఈ చిత్ర బృందం విజయవాడ ఉత్సవ్ ఈవెంట్‌‌లో సందడి చేసింది.

Read also-Kisan Vikas Patra Scheme: రూ.10 లక్షలు పెడితే.. రూ.20 లక్షల రిటర్న్స్.. కళ్లు చెదిరే ప్రభుత్వ స్కీమ్!

దసరా సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ప్రెజెంటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ .. ‘మేము ‘లిటిల్ హార్ట్స్‌’తో ఎంతగా అయితే నవ్వించామో ఈ ‘మిత్ర మండలి’తోనూ అంతే స్థాయిలో ఖచ్చితంగా నవ్విస్తాము. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకే ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా చూసి మీరు నవ్వి నవ్వి కడుపునొప్పితో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు’ అని అన్నారు. నిర్మాత భాను ప్రతాప మాట్లాడుతూ .. ‘అక్టోబర్ 16న అందరినీ నవ్వించేందుకు మేం థియేటర్లోకి వస్తున్నామ’ని అన్నారు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధ్రువన్.. ‘‘మిత్ర మండలి’ నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఈ మూవీలోని ప్రతీ పాటను శ్రోతలు చార్ట్ బస్టర్‌లుగా మార్చారు.’ అని అన్నారు.

Read also-Putin on PM Modi: మోదీతో పెట్టుకోవద్దు.. భారత్ ఎప్పటికీ తలవంచదు.. ట్రంప్‌కు పుతిన్ వార్నింగ్

నటుడు ప్రసాద్ బెహరా మాట్లాడుతూ .. ‘మా మీద ఇంత ప్రేమను కురిపిస్తున్న విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు.’ అని అన్నారు. నటుడు విష్ణు ఓఐ.. ‘మా ‘మిత్ర మండలి’ చిత్రం చివరి వరకు మిమ్మల్ని నవ్విస్తుంది. ప్రియదర్శి ఎప్పుడూ ఓ డిఫరెంట్ కంటెంట్‌లను ఎంచుకుంటూ ఉంటారు.’ అని అన్నారు. హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్..‘‘మిత్ర మండలి’ పక్కా కామెడీ చిత్రం. కాబట్టి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ .. ‘మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు విజయవాడ ఉత్సవ్ కమిటీ, ఏపీ పోలీసు బలగాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలుగు సినిమా గుండె విజయవాడలో కొట్టుకుంటుందని మా పరిశ్రమలోని వ్యక్తులు ఎల్లప్పుడూ చెబుతారు.’ అని అన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకున్నాయి. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమా అభిమానులు.

Just In

01

Delhi Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ఫ్లైట్ ఢిల్లీకి తిరిగి మళ్లింపు

Gold Rates: బిగ్ షాక్.. ఒక్క రోజే అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gade Innaiah: తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్‌కు కారణాలు అవేనా..?

James Ransone: హాలీవుడ్‌కు తీరని లోటు.. జేమ్స్ రాన్సోన్ 46 ఏళ్ల వయసులో కన్నుమూత

Engineering Fees: ఇంకా విడుదల కాని జీవో.. ఇంజినీరింగ్ ఫీజులపై నో క్లారిటీ!