IOB Good News: దసరా పండుగ పురస్కరించుకొని ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) తన కోట్లాది మంది కస్టమర్లకు గుడ్‌న్యూస్ (IOB Good News) చెప్పింది. సేవింగ్స్ అకౌంట్లలో కనీస సగటు బ్యాలెన్స్ (Minimum Average Balance) ఉంచకపోతే విధించే జరిమానాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఖాతాదారుల బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేయడం, ఆర్థిక భారాన్ని కాస్త తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని బ్యాంక్ వివరించింది.
Read Also- Planes collision: ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.. విరిగిపోయిన ఓ విమానం రెక్క
కాగా, ఇప్పటికే ఐవోబీ సిక్స్టీ ప్లస్, ఐవోబీ సేవింగ్స్ బ్యాంక్ పెన్షనర్, స్మాల్ అకౌంట్స్, ఐవోబీ సేవింగ్స్ బ్యాంక్ శాలరీ ప్యాకేజీ వంటి ప్రత్యేక పథకాలపై మినిమం బ్యాలెన్స్ అవసరాన్ని తొలగించామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వర్గాలు ఈ సందర్భంగా ప్రస్తావించాయి. మినిమం సగటు బ్యాలెన్స్ రద్దు నిర్ణయంపై ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నిర్ణయాన్ని ప్రకటించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నిర్ణయం ఖాతాదారులకు కాస్త ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖాతాదారులకు మరింత సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలు అందించడం, ప్రక్రియలు సులభతరం చేయడం, అవాంతరాలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని అజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.
Read Also- Sir Creek Area: చరిత్ర మారిపోతుంది జాగ్రత్త.. పాకిస్థాన్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సంచలన వార్నింగ్
ఖాతాదారులకు రిలీఫ్
సేవింగ్స్ ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించకపోతే విధించే పెనాల్టీని రద్దు చేయడంతో కస్టమర్లకు కాస్త ఉపశమనం దక్కినట్టు అయింది. ఇకపై, మినిమం బ్యాలెన్స్ నిబంధనను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా డబ్బుని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రకటన తక్షణమే అమల్లోకి రావడం కూడా ఖాతాదారులకు ఉపశమనం కలిగించనుంది. ఇంతకు ముందు వసూలు చేసిన జరిమానాలు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అమలులో ఉంటుంది. సాధారణంగా ఆర్థిక ఇబ్బందులు, లేదా గమనించక పోవడంతో చాలా మంది కస్టమర్లు కనీస నిల్వను నిర్వహించలేకపోతుంటారు. పర్యావసానంగా వారు పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోంది. తాజాగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పెనాల్టీని మాఫీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఖాతాదారులకు ఉపశమనం లభిస్తుందిఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో సేవింగ్స్ ఖాతాదారులకు ఊరట దక్కుతుంది.
Read Also- Crime News: బోరబండలో హత్య కలకలం.. భర్తను సుత్తితో అతి దారుణంగా చంపిన భార్య!