Crime News (imgecredit:twitter)
క్రైమ్

Crime News: బోరబండలో హత్య కలకలం.. భర్తను సుత్తితో అతి దారుణంగా చంపిన భార్య!

Crime News: క్షణికావేశంలో సుత్తితో భర్తను కొట్టి హతమార్చింది ఓ ఇల్లాలు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన బోరబండ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. దీంతో అక్కడి స్ధానికులతా షాక్ కి గురయ్యారు.

వివరాల్లోకి వెలితే..

ఇక వివరాల్లోకి వెలితే.. ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్ గాంధీనగర్​ వాస్తవ్యులు లక్ష్మి (54), బాలస్వామి (60) వీద్దరు భార్యాభర్తలు. వీరిద్దరు చిన్నకొడుకు వెంకటేశ్​ తో కలిసి ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఇదిలా ఉండగా అయితే భార్య భర్త లిద్దరు తరచూ చిన్న చిన్న విషయాలపై పెద్దవిగా చేసుకొని గొడవలు పడుతుండేవారు. గత మంగళవారం రాత్రి కూడా ఇలాగే విరిద్దరు మద్య గొడవ జరుగగా మృతుని భార్య లక్ష్మి పట్టరాని కోపంతో పక్కనే ఉన్నసుత్తి తీసుకుని బాలస్వామి తలపై భలంగా కొట్టింది. దాంతో తీవ్రంగా గాయపడ్డ బాలస్వామి అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోరబండ పోలీసులు దర్యాప్తు చేస్తూ, హంతకురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: New Liquor Shops: గద్వాల జిల్లాలో లిక్కర్ షాపులకు దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ సంతోష్

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

అనుమానాస్పద పరిస్థితుల్లో ఏడేళ్ల బాలిక చనిపోయింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాంచన్ బాగ్ నివాసి హుమేయాని (7) మంగళవారం తల్లితో కలిసి మాదన్నపేట చావ్ నీ ప్రాంతంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంటి నుంచి బయకు వెళ్లి తిరిగి రాలేదు. ఆడుకుంటుందేమోనని ముందుగా కుటుంబసభ్యులు అంతగా పట్టించుకోలేదు. చీకటి పడినా రాకపోవటంతో కంగారు పడి అన్ని చోట్లా వెతికినా హుమేయాని జాడ తెలియలేదు. దాంతో ఇంటి టెర్రస్ పైకి వెళ్లి చూడగా నీళ్ల ట్యాంక్​ లో చిన్నారి శవమై కనిపించింది. ప్రమాదవశాత్తు ట్యాంక్ లో పడి చనిపోయిందా? లేక ఎవరైనా చంపి అందులోకి విసిరేశారా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: Hyderabad: పండక్కి గోరింటాకు పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే పక్కా షాకవుతారు.. పెద్ద స్కామే ఇది!

Just In

01

Viral Video: కూతురికి భోజనం నచ్చలేదని.. ఏకంగా యూనివర్శిటీ ముందే ఫుడ్ స్టాల్ పెట్టేసిన తండ్రి

Dhandoraa Teaser: హైదరాబాద్, అమెరికా.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె!

Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష.. ఢాకా కోర్టు సంచలన తీర్పు

Teachers Unions: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌కు ఉపాధ్యాయ సంఘాల పిలుపు.. ఎందుకంటే?

The Girlfriend Collections: బాక్సాఫీస్ వద్ద రష్మిక మూవీ కొత్త రికార్డ్ .. ది గర్ల్‌ఫ్రెండ్ 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?