Hyderabad (Image Source: Freepic)
హైదరాబాద్

Hyderabad: పండక్కి గోరింటాకు పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే పక్కా షాకవుతారు.. పెద్ద స్కామే ఇది!

Hyderabad: సాధారణంగా పండగలు అనగానే అందంగా ముస్తాబయ్యే మహిళలే గుర్తుకు వస్తారు. వారు ఆ రోజున సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమని మెరిసిపోతారు. చేతికి ఎర్రగా పండే గోరింటాకు పెట్టుకుని ఎంతో లక్షణంగా కనిపిస్తారు. ఈ క్రమంలో దసరా (Dussehra 2025) సందర్భంగా చాలా మంది మహిళలు షాపుల్లో గోరింటాకును కొనుగోలు చేసే ఉంటారు. అటువంటి వారికి పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు.

నకిలీ గోరింటాకు..

మార్కెట్ లో మంచి పేరున్న కంపెనీ పేరుతో నకిలీ గోరింటాకును విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దాదాపు రూ. 5 లక్షల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టేపల్లి నివాసి మహ్మద్ అబ్దుల్ వసీం (54) బండ్లగూడ ముస్తాఫాహిల్స్ ప్రాంతంలో మసారత్ మెహందీ పేర గోరింటాకు తయారు చేసే యూనిట్ నడుపుతున్నాడు. తేలికగా డబ్బు సంపాదించేందుకు కరాచీ బ్రాండ్ పేరుతో నకిలీ గోరింటాకు కోన్లను తయారు చేస్తూ హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని వేర్వేరు జిల్లా కేంద్రాల్లో మార్కెటింగ్ చేస్తున్నాడు. ఈ మేరకు సమాచారం సేకరించిన టాస్క్ ఫోర్స్​ సిబ్బంది.. బండ్లగూడ పోలీసులతో కలిసి యూనిట్ పై దాడి చేశారు. పెద్ద మొత్తంలో నకిలీ గోరింటాకును సీజ్​ చేశారు. నిందితుడ్ని తదుపరి దర్యాప్తు నిమిత్తం బండ్లగూడ పోలీసులకు అప్పగించారు.

Also Read: Local Body Elections: బీసీ రిజర్వేషన్ల టెన్షన్.. డైలమాలో ఆశావాహులు.. గ్రామాల్లో తగ్గిన దావత్‌ల జోష్!

నకిలీ గోరింటాకుతో వచ్చే సమస్యలు

సహజ సిద్ధమైన గోరింటాకు పెట్టుకున్నప్పుడు శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. బాడీలోని అధిక ఉష్ణాన్ని గోరింటాకు బయటకు లాగేస్తుందని చెబుతుంటారు. అంతేకాదు చర్మానికి సైతం ఇది మేలు చేకూరుస్తుందని పేర్కొంటారు. అయితే నకిలీ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు దక్కపోగా.. అనారోగ్యం బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మ సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. నకిలీ గోరింటాకు పెట్టుకున్న ప్రాంతంలోని చర్మంపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావొచ్చని తెలియజేస్తున్నారు. విషపూరితమైన రసాయనాలు శరీరంలోకి చొచ్చుకెళ్లి.. ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. కాబట్టి మార్కెట్ లో దొరికే గోరింటాకు పౌడర్లు, కోన్ లను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకూ చెట్టు నుంచి కోసిన గోరింటాకు పెట్టుకోవడానికి ప్రయత్నించాలని హితవు పలుకుతున్నారు.

Also Read: Ramreddy Damodar Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

Just In

01

Akhanda 2 release: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అఖండా 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Jagadish Reddy: 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదు: జగదీష్ రెడ్డి

IND vs WI First Test: తొలి టెస్టులో చెలరేగిన సిరాజ్.. పీకల్లోతూ కష్టాల్లో వెస్టిండీస్.. ఇక వార్ వన్ సైడేనా!

TG Government Lands: ల్యాండ్ పూలింగ్ పై ప్రభుత్వం ఫోకస్.. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి!

Airtel Recharge Plan: అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. రూ.199కే హైస్పీడ్ 5జీ, అపరిమిత కాల్స్.. వర్త్ మామా వర్త్!