Local Body Elections (Image Source: twitter)
తెలంగాణ

Local Body Elections: బీసీ రిజర్వేషన్ల టెన్షన్.. డైలమాలో ఆశావాహులు.. గ్రామాల్లో తగ్గిన దావత్‌ల జోష్!

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు క్షేత్రస్థాయిలో సతమతమవుతున్నారు. పబ్లిక్ మీటింగ్ లు, పార్టీలు వంటివి నిర్వహించేందుకు అనాసక్తిని చూపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ తర్వాత క్షేత్రస్థాయిలో లోకల్ లీడర్ల హాడావిడి పీక్ లెవల్ లో ఉంటుంది. కమ్యూనిటీల వారీగా పార్టీలు, యూత్ తో గ్రూప్ గేదరింగ్స్ వంటివి చేస్తూనే.. ఇంటింటికి తిరుగుతూ తమకు సపోర్ట్ చేయాలంటూ ఆయా ఇళ్ల పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటారు. కానీ గతంతో పోల్చితే ఈ సారి ఆ పరిస్థితి లేదని స్వయంగా రాజకీయ లీడర్లే చెప్తున్నారు.

రిజర్వేషన్లపై ఆందోళన

సాధారణంగా పండుగల సమయంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయితే అన్ని గ్రామాల్లో ధావత్ ల పేరిట లీడర్లు పండుగ వాతావరణం సృష్టించేలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మెజార్టీ గ్రామాల్లో ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. డబ్బులు ఖర్చు పెట్టాలా? వద్దా? అని డైలమాలో పడ్డారు. తమకు టిక్కెట్ వస్తుందా? లేదా? అని కొందరు వెనకడుగు వేస్తుండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశం కోర్టులో ఉన్న నేపథ్యంలో మరి కొందరు ఊగిసలాడుతున్నారు. అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అని ఇంకొందరు డబ్బుల ఖర్చుకు తలొగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై కోర్టు ఏం చెబుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటికీ గ్రామాల్లో స్థానిక జోష్​ఏర్పడకపోవడం గమనార్హం.

ఆ మాజీ మంత్రి వ్యాఖ్యలూ డిస్టర్బే..?

బీసీ రిజర్వేషన్ల పై ప్రభుత్వం జీవో ఇచ్చిన వెనువెంటనే పంచాయితీ రాజ్ శాఖ రిజర్వేషన్ల సీలింగ్ ను తొలగించేందుకు ప్రత్యేక జీవోలు ఇచ్చింది. ఆ తర్వాత కలెక్టర్లు అన్ని గ్రామాలు, మండలాలు వారీగా రిజర్వేషన్ల లిస్టును తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. అప్రూవల్ అనంతరం జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్ల జాబితాను ప్రకటించారు. దీంతో సర్పంచ్, ఎంటీటీసీ, జెడ్పీటీసీ సీట్ల రిజర్వేషన్లలో ఓ క్లారిటీ వచ్చింది. ఆయా రిజర్వేషన్లు బట్టి ఆశావహులు ఎన్నికల ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక వైపు కోర్టు లో విచారణ, మరో వైపు మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్లు గ్రౌండ్ లెవల్లోని అభ్యర్ధులను కాస్త డైలమాలో పడేశాయి. ఎన్నికల నిమిత్తం ఇప్పుడే ఖర్చులు పెట్టుకోవద్దని ఆయన నేరుగానే ప్రకటించారు. దీంతో కొందరు అభ్యర్ధులు స్తబ్ధుగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అక్టోబరు 8 తర్వాతనే

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు క్లియర్ కట్ సూచనలు చేసిన తర్వాత రంగంలోకి దిగాలని ఆశావహులు భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై అక్టోబరు 8 న కోర్టులో విచారణ తర్వాత ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం స్థానిక సంస్థల ఆశావహులు మరో ముందడుగు వేయనున్నారు. దీంతో 31 జిల్లాల్లో 565 జడ్పీటీసీ, ఎంపీటీసీ 5,749 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, గ్రామ పంచాయతీలకు మాత్రం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 12, 733 గ్రామపంచాయతీలకు ఫేజ్ ల వారీగా నవంబరు 8 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ టార్గెట్ పెట్టుకున్నది. నవంబరు 11 లోపు ఎన్నికల ప్రక్రియ ముగియనున్నది.

Also Read: Ramreddy Damodar Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

సర్కార్‌లో కాన్ఫిడెన్స్..

కోర్టు తీర్పు కంటే ముందే సర్కార్ లో పుల్ కాన్పిడెన్స్ ఉంది. తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఇస్తుందనే భరోసాతో పాటు గవర్నర్ కు బిల్లు, ఆర్డినెన్స్ పంపి మూడు నెలలు దాటితే ఆటోమెటిక్ గా అప్రూవల్ అవుతుందనే నమ్మకంతో ప్రభుత్వం ధైర్యంగా ఉన్నది. 42 శాతం రిజర్వేషన్లు పక్కగా అమలవుతాయనే నమ్మకంతో ఉన్నది. దీంతోనే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై మూడు సర్వేలు నిర్వహించారు. ఇందులో ఆశావహులు, పార్టీల పేరిట వేర్వేరుగా స్టడీ చేశారు. పబ్లిక్ నుంచి స్పష్టమైన ఫల్స్ ను సేకరించారు. గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి, అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ కు పాజిటీవ్ సంకేతాలు కనిపించాయని సీనియర్ నేత ఒకరు తెలిపారు. దీంతోనే ఎన్నికలకు ముందడుగు వేసినట్లు ఆయన వివరించారు.

Also Read: BRS Party: నేతల పనితీరుకు పంచాయతీ ఎన్నికలే కీలకం.. వ్యూహం ఫలించేనా..?

Just In

01

Airtel Recharge Plan: అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. రూ.199కే హైస్పీడ్ 5జీ, అపరిమిత కాల్స్.. వర్త్ మామా వర్త్!

Cyber Crime: సైబర్ క్రిమినల్స్ పై పోలీసులు ఉక్కుపాదం.. 22 మంది అరెస్ట్!

Kantara 1 review: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ఎలా ఉందంటే?

RV Karnan: దుర్గం చెరువు పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశం!

Hyderabad: పండక్కి గోరింటాకు పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే పక్కా షాకవుతారు.. పెద్ద స్కామే ఇది!