BRS Party (imagecredit:twitter)
Politics

BRS Party: నేతల పనితీరుకు పంచాయతీ ఎన్నికలే కీలకం.. వ్యూహం ఫలించేనా..?

BRS Party: బీఆర్ఎస్(BRS) పార్టీకి స్థానిక ఎన్నికలు సవాల్ గా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికే మెజార్టీ సీట్లు రావడం ఆనవాయితీ. అయితే కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసమ్మతి తమకు కలిసి వస్తుందని గులాబీ అధిష్టానం భావిస్తుంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటే కేడర్ లో జోష్ నింపవచ్చని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమనం అవుతుందని ప్లాన్ రూపొందిస్తుంది. స్థానిక నేతలకు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు సమాచారం. అయితే ఏ మేరకు పార్టీ ప్రణాళికలు సక్సెస్ అవుతాయనేది ఆసక్తి నెలకొంది.

వరంగల్ సభ తప్ప..

బీఆర్ఎస్ పార్టీకి 60లక్షల సభ్యత్వం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా సభ్యత్వం ఉందని, పార్టీకి కేడర్ ఉందని అంటున్నారు. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమేరకు పార్టీకి కలిసి వస్తుందనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ఏమేరకు పనిచేస్తారనేది పార్టీకి సైతం క్లారిటీ రానుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలు, కేడర్ లో ఇంకా పూర్తిస్థాయిలో నైరాశ్యం పోలేదు. దానిని పోగొట్టేందుకు ఆస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఒక్క వరంగల్(Warangal) సభ తప్ప చెప్పుకోదగిన పార్టీ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం చేపట్టేలేదు. దీంతో కేడర్ లోనూ కొంత స్తబ్దత నెలకొంది. అయితే ఈ స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంట్ లో ఎన్నికల ఓటమిపై సమీక్షించలేదు. నేతల పనితీరుపైనా ఆరా తీయలేదు.

అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం..

బాధ్యులపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీని గాడిన పెట్టలేదు. మరోవైపు నియోజకవర్గ ఇన్ చార్జులుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలనే కొనసాగిస్తున్నారు. నేతలపై వ్యతిరేకతతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని, వ్యతిరేకత ఉన్న వారిని ఎమ్మెల్యే అభ్యర్ధులుగా ప్రకటించడం, మరోవైపు పదేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవడంతోనే ఓటమిపాలయ్యామని పార్టీ అధిష్టానమే పలుసందర్భాల్లోనూ పేర్కొంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మళ్లీవారికే బాధ్యతలను అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో పూర్తిస్థాయిలో పార్టీ నేతలపై కేడర్ లో అసంతృప్తి పోలేదు. కేసీఆర్ పై ప్రజలకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న నేతలపై మాత్రం గత ఒపినియన్ పోలేదు. ఈతరుణంలో ఎలా మెజార్టీ సాధిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Rajasthan Bride: శోభనం రోజున వరుడికి బిగ్ షాక్.. వధువు దెబ్బకు ఫ్యూజులు ఔట్.. ఏమైందంటే?

పదవులతోనే గుర్తింపు..

పలు సందర్భాల్లో కేటీఆర్ సైతం పదేళ్లు పార్టీ కేడర్ ను పట్టించుకోలేదని.. కేవలం రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టామని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు పార్టీ బలోపేతంపై దృష్టిసారించలేదు. పార్టీ కమిటీలు వేయకపోవడంతో పదవులు వస్తాయని ఆశిస్తున్న నేతలు నిరాశలోనే ఉన్నారు. పదవులతోనే గుర్తింపు వస్తుందనుకున్న వారు ఏళ్లుగా రాకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నారు. ఈతరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలా పనిచేస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు ఇవ్వకుండా పార్టీకోసం పనిచేయాలని చెబితే కేడర్.. ఏ పదవితో అడుగుతున్నారని ప్రశ్నిస్తే తాము ఏం సమాధానం చెప్పాలని పలువురు పేర్కొంటున్నారు.

టికెట్ ఇస్తే విజయం సాధిస్తారా?

ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పనితీరుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు గీటురాయిగా మారనున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ఏం అభివృద్ధి చేశారు.. కేడర్ కు ఏ మేరకు అందుబాటులో ఉన్నారు.. వారు రాబోయే ఎన్నికల నాటికి వారి భవిష్యత్ ఏంటనేది కూడా స్పష్టం కానుంది. మళ్లీ వారికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తే విజయం సాధిస్తారా? లేదా? అనేది కూడా ఈ ఎన్నిలకల్లో స్పష్టం కానుందని పార్టీలోని ఓ సీనియర్ నేత తెలిపారు. అందుకే పార్టీ అధిష్టానం సైతం ఆ నేతలకే స్థానిక ఎన్నికల బాధ్యతను అప్పగించిందని తెలిపారు. మెజార్టీ స్థానాలు గెలిపించకపోతే మరోవ్యక్తికి ఆ నియోజకవర్గంలో అవకాశం కల్పించే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని అది కలిసి వస్తుందని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ఇప్పటికే పార్టీ నేతలకు సూచించింది. అయితే ప్రభుత్వంపై ఏమేరకు వ్యతిరేకత ఉన్నదానేది కూడా ఈ స్థానిక ఎన్నికల్లో స్పష్టం కానుంది.

Also Read: Localbody Elections: స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు బీజేపీ వ్యూహం ఇదేనా?

Just In

01

Local Body Elections: బీసీ రిజర్వేషన్ల టెన్షన్.. డైలమాలో ఆశావాహులు.. గ్రామాల్లో తగ్గిన దావత్‌ల జోష్!

Ramreddy Damodar Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

Pawan Kalyan: వారిపై మండిపడ్డ పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?

Singareni Mines: రోజుకు 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సిందే.. సీఎండీ బలరాం ఆదేశం

Money Lending Act: రైతులకు మనీ లెండింగ్ యాక్ట్ అమలు.. త్వరలో రానున్న చట్టం