Planes collision: న్యూయార్క్‌లోని లా గార్డియా ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు కమర్షియల్ విమానాలు టాక్సింగ్ ( ఎయిర్‌పోర్టులో విమానాలను ముందుకు కదిల్చే ప్రక్రియ ) సమయంలో ఒకదానికొకటి (Planes collision) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక విమానం రెక్క విరిగిపోయింది. పక్కనే ఉన్న మరో విమానం నుంచి ఎవరో ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఢీకొన్ని విమానాల వద్ద టార్మాక్‌పై ఎమర్జెన్సీ వాహనాల లైట్లు మెరుస్తుండడం, ఒక విమానం రెక్క విరిగిపోయిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.
కాగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఆడియో ప్రకారం, టాక్సింగ్ చేస్తుండగా ఒక విమానం ముందు భాగం, మరో విమానం కుడి రెక్కను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక విమానం విండ్‌షీల్డ్ (ముందువైపు అద్దం) దెబ్బతిన్నదని పైలెట్లు తెలిపారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం, బుధవారం రాత్రి 9.56 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్టుగా అమెరికా మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది. అయితే, ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
Read Also- Shocking Video: ర్యాంప్ వాక్ చేస్తుండగా భూకంపం.. హడలిపోయిన మోడల్స్.. దెబ్బకు పరుగో పరుగు!
కాగా, ప్రమాదానికి గురైన విమానాల్లో ఒకటి చార్లెట్ డగ్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చిన డెల్టా ఫ్లైట్ డీఎల్5047 అని, అందులో తమ సిబ్బంది ఒకరు ప్రయాణించారని ‘ఏబీసీ న్యూస్’ మీడియా సంస్థ తెలిపింది. విమానం లా గార్డియా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక టాక్సింగ్ జరుగుతున్న సమయంలో, డెల్టాకు చెందిన మరో విమానాన్ని ఢీకొనడంతో, రెక్క విరిగిపోయిందని వివరించింది. కాగా, లా గార్డియా ఎయిర్‌పోర్టులో ఆందోళనలు కలిగించే పలు ఘటనలు జరిగాయి. మార్చి నెలలో కూడా డెల్టా కంపెనీకి చెందిన ఓ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం రెక్క రన్‌వేను తాకింది. దీంతో, ప్రమాదాన్ని నివారించేందుకు పైలెట్ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తునకు కూడా ఆదేశించింది.
Read Also- Sir Creek Area: చరిత్ర మారిపోతుంది జాగ్రత్త.. పాకిస్థాన్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సంచలన వార్నింగ్
టాక్సింగ్ సమయంలో ప్రమాదాలు నివారించడానికి పైలట్లకు సరైన శిక్షణ అవసరమని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. విమానాలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఎప్పటికప్పుడు తగిన సూచనలు స్పష్టంగా, సమయానికి అందించాల్సి ఉంటుందంటున్నారు. కాగా, టాక్సింగ్ మార్గాల్లో స్పష్టమైన మార్కింగ్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలు ఉండాలి. విమానాల మధ్య తగినంత దూరం కచ్చితంగా పాటించాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పైలట్లు, ఏటీసీ మధ్య కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. హడావిడి పడకుండా, విమానాలను నెమ్మదిగా ముందుకు కదిలించాలి. ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఎయిర్‌పోర్ట్ సిబ్బంది టాక్సింగ్ ఏరియాలో క్రమపద్ధతులు పర్యవేక్షిస్తుండాలి. ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే టాక్సింగ్ సమయంలో ప్రమాదాలు తగ్గి, విమానయానం సురక్షితంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
#Breaking
Two #Delta planes collided while taxiing at #NewYork’s LaGuardia Airport, causing one plane’s wing to detach.The incident occurred as one aircraft was arriving from #Charlotte. At least one injury has been reported, with the extent of others unknown.#USA… pic.twitter.com/lrxajMcpWx
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) October 2, 2025