Telangana Govt: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇండ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) సమాలోచనలు చేస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, (Ponguleti Srinivas Reddy) పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రసూల్ పుర జగదీష్ నగర్ కాలని లోని నారాయణ జోపిడి సంఘం వద్ద రూ. 22. 32 కోట్ల వ్యయంతో అయిదు బ్లాక్ లుగా నిర్మించిన 288 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాజెక్టు ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
తిరుమలగిరి పరిధిలో గాంధీ నగర్ లో 47 మంది లబ్ధిదారులు ,శ్రీరామ్ నగర్ లో 9 మంది లబ్ధిదారులు, సికింద్రాబాద్ పరిధిలో నారాయణ జోపిడి వద్ద 288 ఇండ్లతో కలిపి మొత్తం 344 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు మంత్రులు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ,డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నర్మదా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హౌజింగ్ పీడీ గౌతమ్, కలెక్టర్ దాసరి హరిచందన లు పాల్గొన్నారు.
Also Read: Women Safety: మహిళల భద్రత కోసం పటిష్ట వ్యూహం.. బస్సులో పొరపాటున ఈ తప్పులు చేయకండి!
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రసూల్ పురలో మొండి గోడలతో వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు 6,7 నెలల్లో పూర్తి చేసి ఇస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, హామీని నెరవేర్చుకునేందుకు ప్రణాళికా బద్ధంగా, యుద్ధ ప్రాతిపదికన ఆ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామన్నారు. పేదవారి ఆత్మ గౌరవానికి ప్రతీకైన సొంతింటిని ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం త్వరలోనే శుభవార్త
జీహెచ్ఎంసీ పరిధిలో అర్హులైన వారికి వారున్న చోటనే అపార్ట్ మెంట్ల మాదిరిగా ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలనే ఆలోచనతో ప్రభుత్వానికి ఉందని, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా త్వరలోనే పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు. కంటోన్మెంట్ ప్రజలకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెబుతుందని, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరినట్టుగా గతంలో పేదల కోసం కట్టించిన అపార్ట్ మెంట్లకు మరమ్మతులు చేయిస్తామన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో ఇండ్లు కట్టుకున్న పేదలను ఆర్మీ అధికారులు ఇబ్బంది పెట్టకుండా స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు తేవాలని కోరుతున్నానని మంత్రి కోరారు.
Also Read: Mirai Movie: ‘మిరాయ్’కి ‘వైబ్’ యాడయింది.. ఇక కుర్రాళ్లకు పండగే!
ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు
హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ నిధుల కొరత తో పెండింగ్ లో ఉంటే, మా ప్రభుత్వం నిధులు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను పూర్తి చేసిందన్నారు. ఈ రోజు వారు గృహ ప్రవేశం చేసుకున్నారని వివరించారు. గత పదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, ఇస్తారేమోనని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, గ్రామాల్లో పెద్ద ఎత్తున పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు జరుగుతున్నాయనిమంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
60 వేల రేషన్ కార్డులు పంపిణీ
హైదరాబాద్ లో ఇండ్ల నిర్మాణం ఎలా చేపట్టాలనే దానిపై ముఖ్యమంత్రి హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా నేను ,హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చిస్తున్నామని, వారు నివసించే ప్రాంతంలోనే ఇళ్లు నిర్మించాలనే ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి కంటోన్మెంట్ స్థలాలు ఇస్తే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. హైదరాబాద్ లో స్లమ్స్ ,గుడిసెలు ఇల్లు లేని వారికి అక్కడ ఉన్న స్థలాలు ఇస్తే మొదటి ప్రాధాన్యత కల్పించి ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి పొన్నం వివరించారు. హైదరాబాద్ లో 60 వేల రేషన్ కార్డులు పంపిణీ చేశామని, ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కి గ్యాస్ సిలెండర్ అందిస్తున్నామన్నారు.
Also Read: Brazil Couple: కొండ అంచున కారు ఆపి.. రొమాన్స్‌లో మునిగిన జంట.. ఇంతలోనే స్పాట్ డెడ్!