Women Safety: మహిళల భద్రత కోసం పటిష్ట వ్యూహం..
Women Safety ( IMAGE CREDIT; TWITTER)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Women Safety: మహిళల భద్రత కోసం పటిష్ట వ్యూహం.. బస్సులో పొరపాటున ఈ తప్పులు చేయకండి!

Women Safety: ప్రయాణాల్లో మహిళల భద్రత కోసం రాష్ట్ర మహిళా భద్రతా విభాగం పటిష్ట వ్యూహాన్ని సిద్ధం చేసింది. దీంట్లో ఆర్టీసీ, మెట్రో, ఐసీసీసీ, రవాణా శాఖ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఆటో డ్రైవర్ల సంఘాలను భాగస్వాములుగా చేసింది. అందరి సహకారంతో ప్రయాణాల సమయంలో మహిళలు ఎలాంటి నేరాల బారిన పడకుండా చూసేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణను రూపొందించింది. దీనిపై సీఐడీ అదనపు డీజీపీ చారూ సిన్హా మాట్లాడుతూ ప్రయాణిస్తున్న సమయంలో ఎవరైనా అసభ్యకరంగా తాకినా, వికృత చేష్టలకు పాల్పడ్డా బాధితురాళ్లు వెంటనే బస్సు కండక్టర్లు, ఆటోడ్రైవర్లకు తెలియ చేయాలన్నారు.

 Also Read: Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ దసరాకి నో ముక్కా, నో చుక్కా..!

ఆటోడ్రైవర్లు తామే మహిళల రక్షణ కోసం చర్యలు

లేనిపక్షంలో 1‌‌‌‌‌‌00, 112 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సమస్య తెలిసిన వెంటనే బస్సు కండక్టర్లు, ఆటోడ్రైవర్లు తామే మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోవచ్చన్నారు. ఇక, ఫిర్యాదు అందిన వెంటనే పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయన్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్నారు. అనంతరం షీ టీమ్స్​ సిబ్బంది విచారణ చేస్తారని చెప్పారు. ఇక, రవాణా సంస్థల మధ్య సమన్వయం కోసం ప్రతీ సంస్థ నుంచి ఓ నోడల్ అధికారి ఉంటారని తెలిపారు. ఉమెన్​ సేఫ్టీ వింగ్ లోని షీ టీమ్స్ కేసులను పర్యవేక్షిస్తాయని చెప్పారు.

సామాజిక మార్పు అవసరం

బహిరంగ ప్రదేశాల్లో ఈవ్ టీజింగ్ కు పాల్పడటం, లైంగిక వేధింపులు జరపటం వంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలంటే సామాజిక మార్పు అవసరమని సీఐడీ అదనపు డీజీపీ చారూ సిన్హా అభిప్రాయ పడ్డారు. ఇలాంటివి నేరపూరిత చర్యలు అన్న దానిపై సమాజంలో స్పష్టత రావాలని చెప్పారు. ఇలాంటి పనులకు పాల్పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలకు గురి కాక తప్పదని పురుషులు తెలుసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే మహిళల నుంచి ఏవైనా ఫిర్యాదులు అందినపుడు వెంటనే ఎలా స్పందించాలన్న దానిపై కండక్టర్లకు అంతర్గత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.

కూతురిపై పలుమార్లు అఘాయిత్యం.. చీ.. చీ అసలు తండ్రివేనా?  

కూతురి పైనే అఘాయిత్యానికి పాల్పడ్డ కామంధునికి యావజ్జీవ కారాగార శిక్ష, 5వేల రూపాయల జరిమానా విధిస్తూ 12వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి టీ. అనిత  తీర్పు చెప్పారు. బాధితురాలికి 10లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపురం ప్రాంత నివాసి ఎం.ఎం.పీ.జోస్ జన్మనిచ్చిన కూతురిపైనే పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ హింసను భరించ లేకపోయిన బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు అప్పట్లో గోపాలపురం సీఐగా ఉనన చంద్రా రెడ్డి కేసులు నమోదు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్​ సీఐగా ఉన్నజ్యోత్స్నతో కలిసి విచారణ జరిపి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడైన జోస్​ కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

 Also Read: Heroines: ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంత దురదృష్టవంతులంటే..

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు