Nidhhi and Neha
ఎంటర్‌టైన్మెంట్

Heroines: ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంత దురదృష్టవంతులంటే..

Heroines: ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంతో దురదృష్టవంతులు. వీరికి అస్సలు కలిసి రావడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అనే చందాన మారింది వీరి పరిస్థితి. అవకాశాలు వస్తున్నాయి, కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. పోనీ, స్పెషల్ సాంగ్స్‌తో అయినా అందరి దృష్టిలో పడదామని భావించి, వాటిని చేస్తే.. చివరికి వచ్చే సరికి ఎడిటింగ్‌లో లేపేస్తున్నారు. మరి ఇంతకంటే అన్ లక్కీ ఫెలోస్ ఎవరైనా ఉంటారా? ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరని అనుకుంటున్నారు కదా..? ఇంకెవరు ‘హరి హర వీరమల్లు’ ఫేమ్ నిధి అగర్వాల్ ఒకరైతే.. మరొకరు ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి. ఈ ఇద్దరికీ ఈ మధ్యకాలంలో అసలేం కలిసి రావడం లేదు. ఎంతో నమ్మకంతో చేసిన సినిమాలు కూడా సక్సెస్ కాలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. పోనీ, వీరేమైనా ఐరన్ లెగ్‌లా అంటే కానే కాదు. ఒకరికి ‘ఇస్మార్ట్ శంకర్’, ఇంకొకరికి ‘టిజె టిల్లు’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. కానీ, ఆ తర్వాత చేసిన సినిమాలే.. ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు. ఇక వారి దురదృష్టం గురించి చెప్పుకోవాలంటే..

Also Read- Mirai Movie: ‘మిరాయ్’కి ‘వైబ్’ యాడయింది.. ఇక కుర్రాళ్లకు పండగే!

‘మిరాయ్’ స్పెషల్ సాంగ్ చేసినా..

ముందుగా నిధి అగర్వాల్ విషయానికి వస్తే.. ‘హరి హర వీరమల్లు’ సినిమా చేసిన నిధి అగర్వాల్, ఈ సినిమా రిజల్ట్‌తో షాక్‌కు గురైంది. సరేలే, అని ‘మిరాయ్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తే.. తీరా ఆ సాంగ్‌ని ఎడిటింగ్‌లో లేపేశారు. ‘మిరాయ్’లో తన పాట చాలా బాగా వచ్చిందని, అది రిలీజైతే, తనకు హీరోయిన్‌గా కాకపోయినా.. స్పెషల్ ఆఫర్స్ వస్తాయని ఎంత ఆశగా ఎదురు చూసింది. కానీ, ‘మిరాయ్’ నిడివి దృష్ట్యా మేకర్స్ ఆ పాటని, ఆ పాటతో పాటు ‘వైబ్ ఉంది’ సాంగ్‌ని కూడా లేపేశారు. ‘వైబ్ ఉంది’ సాంగ్‌ని యాడ్ చేయబోతున్నట్లగా అధికారిక ప్రకటన అయితే వచ్చింది కానీ, నిధి అగర్వాల్ చేసిన పాట గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కనీసం ఆ సినిమా ఓటీటీ రిలీజ్ చేసే సమయంలోనైనా పాటను యాడ్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

Also Read- Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత

‘ఓజీ’లో స్పెషల్ సాంగ్ చేసినా..

ఇక మరో హీరోయిన్ నేహా శెట్టి విషయానికి వస్తే.. ఈ భామది ఇంకో గోల. ‘డీజే టిల్లు’ తర్వాత ఈ భామ నాలుగైదు సినిమాలు చేసింది కానీ, ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. అందరూ రాధికగా ఆమెను గుర్తు పెట్టుకున్నారు. అలాంటి పాత్ర ఒక్కటీ పడలేదు. దీంతో ఈ భామ కూడా ఓ స్పెషల్ సాంగ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అదీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజీ’ మూవీలో. ఈ సినిమా విడుదలై, సంచలనాలను క్రియేట్ చేస్తోంది. కానీ, సినిమాలో నేహా శెట్టి సాంగ్‌ని మేకర్స్ లేపేశారు. దీంతో ఈ భామ బాధ మాములుగా లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలో చేసే అవకాశం రావడం చాలా అరుదు. అలాంటి అవకాశం వచ్చి కూడా, ఎడిటింగ్‌లో వెళ్లిపోవడం అంటే నిజంగా ఆమెకు ఏపాటి లక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాట గురించి దర్శకుడిని అడిగితే.. మేము యాడ్ చేస్తామని ఎక్కడా చెప్పలేదు అని అంటున్నారు. సో.. ఈ లెక్కన నేహా శెట్టి పాట థియేటర్లలోకి రానట్టే. మరి ఓటీటీలోకి అయినా వదులుతారో లేదో చూడాలి. ఇలా ఈ ఇద్దరు మంచి అవకాశం వచ్చి కూడా.. నిరాశకు లోనవ్వాల్సి వచ్చిందని సోషల్ మీడియా అంతా ఒకటే వార్తలు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Heroines: ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంత దురదృష్టవంతులంటే..

Jubilee Hills Bypoll: బీజేపీలో ట్విస్ట్‌.. జూబ్లీహిల్స్ అభ్యర్థిని తానేనంటూ ప్రచారం.. లీడర్స్ షాక్!

Allu Arjun: ఐకాన్ స్టార్ సర్‌ప్రైజ్.. ‘ఓజీ’ చూసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్!

Balineni: అది అవాస్తవం.. పవన్ కళ్యాణ్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలకు బాలినేని క్లారిటీ!

New DGP: నిజమైన ‘స్వేచ్ఛ’ కథనం… తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి