Balakrishna Controversy: అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేసిన కామెంట్స్‌పై అఖిల భారత చిరంజీవి యువత (Akhila Bharatha Chiranjeevi Yuvatha) ఫైర్ అయింది. గతంలో కూడా చిరంజీవిని అవమానిస్తూ.. బాలయ్య చాలా కామెంట్సే చేశారని, ఇలాగే ఊరుకుంటే శృతి మించిపోయే అవకాశం ఉందని, ఎట్టకేలకు అఖిల భారత చిరంజీవి యువత రియాక్ట్ అయింది. మా బ్లడ్, మా బ్రీడ్ అంటూ గతంలో కూడా బాలయ్య చాలా సార్లు బహిరంగంగా చిరంజీవిని అవమానించేలా మాట్లాడారు. బాలయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం అంటూ చిరంజీవి (Megastar Chiranjeevi) లైట్ తీసుకున్నారు. కానీ, ఈసారి చిరంజీవి కూడా కామ్‌గా ఉండలేదు. బాలయ్య మాటలకు వెంటనే కౌంటర్ ఇచ్చేలా ఓ లేఖను విడుదల చేశారు. జగన్ (YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళ్లారో, అక్కడ ఏం జరిగిందో విపులంగా తెలిపారు. అంతేకాదు, తనని ‘వాడు, వీడు’ అన్న పదాలపై రియాక్ట్ అవుతూ.. సీఎం అయినా, సామాన్యుడు అయినా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను తప్పితే.. నీలా మాట్లాడనంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇక చిరంజీవి రియాక్ట్ అయిన తీరుని గమనించిన అఖిల భారత చిరంజీవి యువత స్పందిస్తూ.. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో..
Also Read- OG collections: ‘ఓజీ’ ఫస్ట్ డే గ్రాస్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..
అధికార మదం తలకెక్కి..
‘‘తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా అనేక సార్లు అవమానకరంగా మాట్లాడటం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి.. ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించాము. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు అండగా నిలుచుందీ… ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి అహర్నిశలూ కృషి చేసింది మెగా కుటుంబమే అన్న విజ్ఞత మరిచి, అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ.. నేడు చట్టసభల్లో సైతం చిరంజీవి ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడేందుకు తెగించారు. ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవిని సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్ధమవుతోంది.
బాలకృష్ణ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి
అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ గారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ గారు మెగా కుటుంబంపై గతంలో కూడా అనేక సార్లు
— Ravanam Swami naidu (@swaminaidu_r) September 26, 2025
Also Read- Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య, కామినేని సంభాషణపై స్పందించిన చిరు.. అసలు వాస్తవం ఇదేనట!
తీవ్ర నిరసనలు తప్పవ్..
మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని విన్నవిస్తున్నాం. చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బాలకృష్ణ స్పందించి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని యెడల బాలకృష్ణ ప్రజాక్షేత్రం ముందు తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం’’ అని అఖిల భారత చిరంజీవి యువత తరపున రవణం స్వామి నాయుడు రియాక్ట్ అయ్యారు. ఈ పోస్ట్‌కు చిరు అభిమానులు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని, మళ్లీ ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు