Jubileehills-bypoll
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

JubileeHills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నోడల్ ఆఫీసర్లకు కీలక ఆదేశాలు

JubileeHills bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సిద్దం కావాలి

పారదర్శకంగా ఎన్నిక నిర్వహిద్దాం
ఓటర్లుగా ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీలు వేయొద్దు
నోడల్ ఆఫీసర్ల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక (JubileeHills bypoll) కోసం నియమించిన నోడల్ అధికారులంతా సిద్దం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తటస్థంగా వ్యవహరిస్తూ నిబంధనలకు లోబడి, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పని చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో కర్ణన్ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నోడల్ అధికారుల సన్నద్ధతను ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమించకూడదని అధికారులకు సూచించారు. ఎన్నికలకు సంబంధించి నిర్వహించే శిక్షణ కార్యక్రమాలలో రిటర్నింగ్ అధికారి పాల్గొని నోడల్ అధికారులకు వారి విధులు, బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని కర్ణన్ సూచించారు.

Read Also- Jr NTR: ‘కాంతార చాప్టర్ 1’ వేదికపై ‘డ్రాగన్’ అప్డేట్ ఇవ్వబోతున్నారా? ఫ్యాన్స్ వెయిటింగ్!

ఎన్నికలలో నోడల్ అధికారులందరి పాత్ర, బాధ్యత తెలిసేలా సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని అధికారులను కర్ణన్ ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రవాణా, పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

Read Also- Medchal ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి

ఎన్నికల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సీ-విజిల్, టోల్ ఫ్రీ నంబర్లు, ఇతర వ్యవస్థల ద్వారా వేగంగా స్పందించేలా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పోస్టర్లు, బ్యానర్లు, గోడ రాతలు, హోర్డింగ్ లను వేగంగా తొలగించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కమిషనర్ (రెవెన్యూ , ఐటీ) అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్ (ఎలక్షన్స్) హేమంత్ కేశవ్ పాటిల్, జోనల్ కమిషనర్లు అపూర్వ్ చౌహాన్, హేమంత్ సహదేవరావు, అదనపు కమిషనర్లు అలివేలు మంగతాయారు, ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Read Also- Petal Gahlot: ఐరాసలో పాక్ ప్రధాని వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన భారత లేడీ ఆఫీసర్

Just In

01

K-Ramp: ‘కె-ర్యాంప్’ అంటే బూతు మాట కాదు.. ఏంటంటే..?

Nikhil Siddhartha: నేను 2008లోనే చెప్పా.. ‘ఓజీ’ సినిమాపై నిఖిల్ ఆసక్తికర పోస్ట్!

Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరింపు.. గుండెపోటుతో బాధితురాలి మృతి

Mirai Movie: మరో ఆఫర్ ప్రకటించిన ‘మిరాయ్’ నిర్మాత.. పండగ కానుక అదిరింది!