Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) చేస్తున్న ‘డ్రాగన్’ (Dragon) సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో తెలియంది కాదు. రీసెంట్‌గా ఎన్టీఆర్ నుంచి వచ్చిన ‘వార్ 2’ (War 2) సినిమా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పుడు అభిమానుల కళ్లన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ హీరోగా చేస్తున్న ‘డ్రాగన్’పైనే ఉన్నాయంటే అతిశయోక్తి కానే కాదు. ఇక ఇప్పుడంతా ‘డ్రాగన్’ అప్డేట్ రాబోతుందంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. నీల్-ఎన్టీఆర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి రాబోతున్న ‘కాంతార: ఛాప్టర్ 1’ (Kantara: Chapter 1) చిత్రం అక్టోబర్ 2న విడుదల కాబోతున్న నేపథ్యంలో.. చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read- R Narayana Murthy: చిరంజీవి చెప్పిందంతా నిజమే.. బాలయ్య కాంట్రవర్సీపై పీపుల్ స్టార్ స్పందనిదే!
‘డ్రాగన్’ అప్డేట్ ఇవ్వబోతున్నారా?
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హోంబలే ఫిల్మ్స్ నిర్మాత కిరంగదూర్.. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టితో ఉన్న అనుబంధం, హోంబలే ఆహ్వానం కలగలిసి.. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చేందుకు ఓకే చెప్పారు. ఎన్టీఆర్ చీప్ గెస్ట్‌గా రాబోతున్నట్లుగా ఆల్రెడీ చిత్ర బృందం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. సేమ్ నిర్మాణ సంస్థ, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్ ఒకే స్టేజ్‌పై ఉంటారు కాబట్టి.. కచ్చితంగా ‘డ్రాగన్’కు సంబంధించి ఏదో ఒక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అలాగే ‘కాంతార: చాప్టర్ 1’లో చేస్తున్న హీరోయిన్నే.. ‘డ్రాగన్’లో కూడా హీరోయిన్ అని రుక్మిణి వసంత్ పేరు అధికారికంగా బయటకు వచ్చింది. ఆమె కూడా ఇదే స్టేజ్‌పై ఉంటుందని కాబట్టి.. ఫ్యాన్స్ ఆశలు నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో? ఈ ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 28న హైదరాబాద్, జెఆర్‌సి కన్వెన్షన్‌లో జరగనుంది.
Also Read- Ind Vs Pak Final: ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, పాండ్యా ఆడడం లేదా?.. కోచ్ షాకింగ్ అప్‌డేట్
‘కాంతార 3’లో ఎన్టీఆర్?
మరో వైపు ఎన్టీఆర్ ‘దేవర’కు సంబంధించి కూడా ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ‘దేవర’ చిత్రం విడుదలై వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ‘డ్రాగన్’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకునే సమయానికి ‘దేవర పార్ట్ 2’ సెట్స్‌పైకి రానుందని అంటున్నారు. అలాగే, ‘కాంతార’ పార్ట్ 3లోనూ ఎన్టీఆర్ భాగం కానున్నారనేలా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ‘కాంతార’ పార్ట్ 3 (Kantara 3)లో ఎన్టీఆర్ మెయిన్ రోల్‌లో కనిపించనున్నారని, అందుకు సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. బహుశా, దానిపై కూడా ఇప్పుడు జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో క్లారిటీ వస్తుందేమో చూద్దాం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు